బెంగళూరులో హీరో.. ఆటో డ్రైవర్ కు రూ.10వేల ప్రైజ్

Banglore Auto Driver
Spread the love

ఈ ఆటో డ్రైవర్ బెంగళూరులో ఇప్పుడు హీరో. ఓ మంచిపని చేశారు. జనం అందరూ చూస్తుండగా.. డేర్ చేశాడు. జనంతో శెభాష్ అనిపించుకుంటున్నాడు. పోలీసులతో ప్రైజ్ మనీ కూడా గెల్చుకున్నాడు.

ఇతడి పేరు హనుమంత. మొన్నటి బుధవారం నాడు రెగ్యులర్ గానే ఆటో నడుపుకుంటూ వస్తున్నాడు. సడెన్ గా .. దొంగ దొంగ అనే గొంతు వినిపించింది. ఎవరో మహిళ ఆపదలో ఉన్నట్టు అర్థమైంది.

బైక్ పై వచ్చిన ఓ దొంగ.. మహిళ మెడలోనుంచి చైన్ ను లాక్కుని పారిపోయాడు. ఈ సంగతి ఆటో డ్రైవర్ హనుమంత అర్థంచేసుకున్నాడు. వెంటనే తన ఆటో స్పీడుపెంచాడు. బైక్ ను చేజ్ చేశాడు. బైక్ ఎటు పోతే అటవెళ్లాడు. కొంతదూరం వెళ్లాక బైకర్ ను ఓవర్ టేక్ చేసి… బైక్ కు ఆటోను అడ్డుపెట్టాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి దొంగను పట్టుకున్నాడు. రోడ్డుపై గలాటా చూసి. పోలీసులు వచ్చారు. సంగతి తెల్సుకుని.. చైన్ దొంగను అరెస్ట్ చేశాడు. అతడి దగ్గర బంగారు చైన్ ను సీజ్ చేసిన పోలీసులు.. బాధితురాలిని పిలిచి అప్పగించారు. అంతమందిలో డేర్ చేసిన ఆటో డ్రైవర్ హనుమంతకు స్థానికుల సహకారంతో.. రూ.10వేల ప్రైజ్ మనీ అందజేశారు పోలీసులు.

అందరు డ్రైవర్లు ఒక్కలా ఉండరు. ఇలాంటి మంచి వాళ్లు కూడా ఉంటారు.

Read Also : ఇదేం స్టైలురో రాములా.. బాటిల్ ఫైట్.. కొడవలే లైటర్

(Visited 145 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *