Jayasudha : తెలుగు ఇండస్ట్రీలో జయసుధ (Jayasudha) నటిగా, రాజకీయ నాయకురాలిగా సుప్రసిద్ధురాలు. సహజ నటి అనే బిరుదుని సంపాదించిన జయసుధ ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టింది. మళ్లీ పెళ్లి గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా జయసుధ ఖండించేది. కానీ.. ఈసారి వస్తున్న పుకార్లపై స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమనే చర్చ జరుగుతోంది.
Save Damagundam-HYDRAA : సేవ్ దామగుండం.. రేవంత్ హైడ్రాకు ఊహించని షాక్
అలా సీనియర్ ఎన్టీఆర్ (NTR) మొదలు కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్ఆర్ ఇలా ఎంతో మంది సీనియర్స్ తో ఆడిపడింది. ముఖ్యంగా శ్రీదేవి,జయప్రద వంటి హీరోయిన్లు టాలీవుడ్ ని ఏలుతున్న సమయంలోనే జయసుధ వారి పోటీతత్వాన్ని నిలదొక్కుకొని ఇండస్ట్రీలో కొనసాగింది. అంతేకాకుండా శ్రీదేవి జయప్రదలు బాలీవుడ్ కి వెళ్లడంతో వాళ్లు చేసే సినిమాలు అన్ని జయసుధ దగ్గరికి వచ్చాయి. దాంతో ఈ హీరోయిన్ సౌత్ లో టాప్ స్టేజ్ కి వెళ్ళిపోయింది.
YVS Ram Devadasu : రిలీజైన కొన్ని వారాలకు హిట్టయిన ఒకేఒక్క సినిమా ‘దేవదాసు’
అటువంటి ఈ వెటరన్ నటికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన సంగతి మనకు తెలిసిందే. ఇక గత కొద్ది రోజులుగా జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. జయసుధ మొదట వడ్డె రమేష్ సోదరుడు రాజేంద్రప్రసాద్ ని పెళ్లి చేసుకొని ఆయనకు విడాకులు ఇచ్చాక బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు నితిన్ కపూర్ ని పెళ్లాడింది.
Tripti Dimri : ‘తృప్తి’ చేతినిండా సినిమాలు.. కుర్రాళ్లకు పెంచుతోంది బీపీ
ఇక నితిన్ కపూర్ 2017లో సూసైడ్ చేసుకొని మరణించారు. భర్త చనిపోయాక మళ్ళీపెళ్లి చేసుకోలేదు జయసుధ. అయితే తాజాగా జయసుధ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటంటే 64 ఏళ్ళ వయసులో జయసుధ రహస్యంగా మూడో పెళ్లి చేసుకుందనే రూమర్ వినిపిస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఓ బిజినెస్ మ్యాన్ తో తిరుగుతోంది. ఇక ఏ ఈవెంట్ జరిగినా కూడా జయసుధ ఆ బిజినెస్ మాన్ తో కలిసి రావడంతో చాలామంది వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, జయసుధ ఆ బిజినెస్ మ్యాన్ మూడో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ప్రచారం చేశారు. ఈ విషయంలో స్పందించిన జయసుధ అలాంటిదేమీ లేదు ఆయన నా బయోపిక్ రాయడం కోసం ఇండియాకు వచ్చారు అంటూ చెప్పి కవర్ చేసింది. ఐతే. ఆ బిజినెస్ మాన్ రహస్యంగా పెళ్లి చేసుకుందని, అందుకే ఆయన తరచూ జయసుధతో కనిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జయసుధ స్పందిస్తే కానీ ఈ వార్తల విషయంలో ఫుల్ స్టాప్ పడదంటున్నారు పరిశీలకులు.