Tripti Dimri : గతేడాది వచ్చిన ‘యానిమల్’ సినిమాలో జోయా క్యారెక్టర్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది త్రిప్తి దిమ్రి. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అయింది. ఈ బ్యూటీ గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. యానిమల్ మూవీతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 2017లో వచ్చిన ‘మామ్’ మూవీతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన త్రిప్తి.. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు దక్కలేదు.
యానిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. 30 ఏండ్లు దాటినా వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇటీవల విక్కీ కౌశల్ తో ఆమె నటించిన ‘బ్యాడ్ న్యూస్’ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టింది. ఈ సినిమాలోని ‘తోబా తోబా’ సాంగ్ యూట్యూబ్ లో ట్రెడింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం త్రిప్తి చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. భూల్ భులయ్యా3, విక్కీ విద్యా కా వో వాలా, ధడక్2 సినిమాల్లో నటిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లోనూ యాక్టివ్ గా ఉండే త్రిప్తి.. హాట్ హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లకు సెగలు రేపుతోంది.