Article 370 Amit Shah Jammu Kashmir

Article 370 : ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు : అమిత్ షా సంచలనం

Article 370: జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370 (Article 370) రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారం వచ్చాక ఆర్టికల్ ను పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా చెబుతున్నారు. ఐతే.. ఈ ఆర్టికల్ ను ఏ శక్తీ తిరిగి తీసుకురాజాలదు అని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజెరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

Save Damagundam-HYDRAA : సేవ్ దామగుండం.. రేవంత్ హైడ్రాకు ఊహించని షాక్

“ఇప్పుడు ఈ ప్రాంతంలో బంకర్ల అవసరం లేదు. ఎందుకంటే.. కాల్పులు జరిపే సాహసం ఎవరూ చేయలేరు. జమ్మూకశ్మీర్ లో కేవలం మన దేశ త్రివర్ణ పతకం మాత్రమే రెపరెపలాడుతుంది… అని అమిత్ షా పేర్కొన్నారు. కొందరు పాకిస్థాన్తో చర్చలు జరపాలని బలంగా కోరుకుంటున్నారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదు. దేశంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. మోదీ సర్కార్ అలా ఎన్నటికీ చేయదు. భారత ప్రజలపై రాళ్లు రువ్విన వారికి కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదు” అని అమిత్ షా స్పష్టం చేశారు.

Jayasudha : రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న జయసుధ.. అతడెవరో తెలుసా?

జమ్మూ కాశ్మీర్ లో మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్లు మాత్రం షేక్ అబ్దుల్లా జెండాను తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారు. బుల్లెట్లకు బుల్లెట్లతో సమాధానం చెబుతాం అని అమిత్ షా చెప్పారు.

YVS Ram Devadasu : రిలీజైన కొన్ని వారాలకు హిట్టయిన ఒకేఒక్క సినిమా ‘దేవదాసు’

(Visited 4 times, 1 visits today)
Fb5d304dbf82099e12bae360aee19497
Author: kekanews