ఒత్తి ఇడిశిపెట్టిండు.. కార్మికులు విధులకు రావాలని సీఎం పిలుపు

TS RTC KCR KEKANEWS

ఆర్టీసీ కార్మికులు రేపు విధుల్లో చేరండి

మీరు మా బిడ్డలు.. మిమ్మల్ని కాపాడుకుంటాం

అవకాశం ఉన్నప్పటికీ మేం ప్రైవేటుకు ఇవ్వదల్చుకోలేదు

ఆర్టీసీని అందరం కలిసి సింగరేణిలా లాభాల్లోకి తెద్దాం

చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం

ప్రెస్ మీట్ లో ప్రకటించిన సీఎం కేసీఆర్

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. అందరికందరినీ రేపు ఉదయమే విధుల్లోకి రావాలని ఆయన ఆర్టీసీ తరఫున, ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. ఆర్టీసీని ప్రైవేటుకు ఇవ్వాలన్న నిర్ణయంలో తొందరేమీ లేదన్నారు. ఆర్టీసీ ప్రజల సంస్థ అనీ.. అది ఎప్పటికీ ఉండాలని ఆయన అన్నారు. వెంటనే ఆర్టీసీకి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల మరణాలకు విపక్షాలు, యూనియన్లే కారణమన్నారు. కానీ.. ఆ చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి (కొడుకైనా.. కూతురైనా.. ఇంకెవరైనా) ఆర్టీసీలో గానీ.. ప్రభుత్వంలో గానీ ఉద్యోగం ఇస్తామని చెప్పారు కేసీఆర్.

రిలీఫ్ ఇచ్చిన సీఎం

52 రోజుల పాటు సమ్మె చేసి… 2 రోజుల పాటు విధుల్లో చేరేందుకు ఆపసోపాలు పడిన కార్మికుల పట్ల తన దయను చూపించారు. ఆర్టీసీ సమస్యను మరింత పెద్దది చేయదల్చుకోలేదన్నారు.

Read Also : ఎవరు చాణక్యులు..? ఎవరు కింగ్ మేకర్లు..?

మమ్మల్ని తిట్టిన్రు.. కానీ మేం పట్టించుకోం

ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే. “ఆర్టీసీ సమస్యను పరిష్కరిస్తాం. ప్రజల పొట్టలు నింపినం తప్ప.. పొట్టలు కొట్టలే. హయ్యెస్ట్ పెయిడ్ అంగన్ వాడీలు తెలంగాణలో ఉన్నారు. హయ్యెస్ట్ పెయిడ్ హోంగార్డులు తెలంగాణలో ఉంటారు. ఎక్కువ జీతం తీసుకునే ఆశావర్కర్లు తెలంగాణలోనే ఉంటారు. ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ 30శాతం మేమే ఇస్తున్నాం. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఇవాళ ఆర్టీసీ సమ్మె చేసిన్రు. ఔనన్నా కాదన్నా.. ఇది చరిత్రలో ఉంటది. వాళ్లు మమ్మల్ని ప్రతిపక్షాలు, యూనియన్ల మాయలో పడి తిట్టిన్రు. కానీ మేం పట్టించుకోదల్చుకోలేదు. వాళ్లమాటలు నమ్మకండి.”

ప్రగతి భవన్ కు పిలిపించి డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడతా

“వాళ్లు 2 నెలల జీతాలు పోగొట్టుకున్నరు. లేబర్ కోర్టుకు రెఫర్ చేస్తే ఉద్యోగాలు పోతాయ్. కానీ మేం అలా చేయడం. ప్రైవేటుకు ఇచ్చే అవకాశం ఉన్నా మేం ఇవ్వదల్చుకోలేదు. మాకు తొందరలేదు. రేపు ఉదయమే విధుల్లో చేరండి. బేషరతుగా చేర్చుకుంటాం. మీరు మా బిడ్డలు. ఆర్టీసీని సంస్థను సింగరేణిలా మార్చుకుందాం. లాభాల్లోకి తెద్దాం. ఆర్టీసీకి రూ.100కోట్లు ఇస్తున్నాం. ఢిల్లీకి వెళ్లి వస్తా. ఆ తర్వాత ప్రతి డిపోనుంచి ఐదుగురు కార్మికులతో ప్రగతి భవన్ లో మాట్లాడుతా. అధైర్యపడకండి. రేపు విధుల్లో చేరండి. ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోతుందనుకుంటున్నా.” అన్నారు కేసీఆర్.

Read Also :

కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావు… బయో డైవర్సిటీ కారు డ్రైవర్ ఇతనే

 

(Visited 608 times, 1 visits today)

One Comment on “ఒత్తి ఇడిశిపెట్టిండు.. కార్మికులు విధులకు రావాలని సీఎం పిలుపు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *