కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావు… బయో డైవర్సిటీ కారు డ్రైవర్ ఇతనే

Kalvakuntla Krishna Milan Rao

కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై శనివారం మధ్యాహ్నం 1.19 నిమిషాలకు గంటకు 105 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఇతడే. Empower Labs – AR Gaming సంస్థ ఫౌండర్, సీఈఓ ఇతను. ఖరీదైన వోక్స్ వ్యాగన్ కారును అత్యంత ర్యాష్ గా.. పద్ధతిలేకుండా… ప్రమాదకరంగా డ్రైవ్ చేసి.. ఫ్లై ఓవర్ గోడకు ఢీకొట్టి… కారుతో సహా కిందపడిపోయాడు. కానీ.. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో… గాయాలతో తప్పించుకున్నాడు. అతడు కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

కారు నంబర్ TS 09 EW 5665 ఆధారంగా అతడి వివరాలు సేకరించారు పోలీసులు. అతడి లైఫ్ స్టైల్ కూడా మోడ్రన్ గా ఉంటుందని చెప్పారు. ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిందని తెలిసింది. స్పీడ్ గన్ లో రికార్డైన వివరాలతో.. అతడి కారు స్పీడ్ ను అంచనావేసి.. వెయ్యిరూపాయల జరిమానాతో ఈ చలాన్ జెనరేట్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఫ్లై ఓవర్ పై ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కూతురు తీవ్రంగాగాయపడింది.

(Visited 206 times, 1 visits today)

One Comment on “కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావు… బయో డైవర్సిటీ కారు డ్రైవర్ ఇతనే”

  1. This is a murder not an accident. Driver should be kept in jail for lifetime for killing one lady with his over speed driving.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *