సీఎం, కార్మికులకు ఏం కాలె..! జనానికే మూడు రకాలుగా బొక్క

cm kcr rtc2
Spread the love

సరైన సామెత గుర్తురావడం లేదు కానీ.. అటు సర్కారు బానే ఉంది. ఇటు ఇన్నాళ్లు సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు(కార్మికులు) కూడా బాగానే ఉన్నారు. మధ్యలో… సామాన్య జనమే నల్లిలా నలిగిపోయారు. మరింతగా నలగడానికి తయారైపోయారు. ఎంతలా అంటే.. భావోద్వేగ పరంగా… ఆర్థికంగా… శారీరకంగా…. ఇలా అన్ని రకాలుగానూ చితికిపోయారు తెలంగాణ పబ్లిక్.

భావోద్వేగపరంగా..

జనం రియాక్షన్ ఎలా మారిపోయిందో ఓసారి గమనించిండి. మొదట.. దసరా పండుగనాడు బస్సులు బందైనప్పుడు “బస్సులెందుకు బంద్ పెట్టిన్రు బై.. మీకు జీతాలెక్కువైనయ్.. అవసరమా ఈ టైమ్ ల బంద్” అంటూ ఈసడించుకుంటూ కార్మికులపై జనం మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు బస్సులు బంద్ చేస్తారు బాబూ అనుకుంటూ… దాదాపు రెండు నెలలు అలా అలా నడిపించేశారు. కష్టాలకోర్చి ప్రయాణాలు పెట్టుకున్నారు. సీఎం కఠినంగా ఉండేసరికి.. జనానికి వాళ్లపై అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అయ్యో పాపం వీళ్ల ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అని మనసులో అనుకున్నారు. మహిళా కార్మికుల కన్నీళ్లు చూసి.. డ్రైవర్, కండక్టర్ల చావులు చూసి.. అయ్యో పాపం అని జనం కూడా వలవలా ఏడ్చేశారు. సమ్మె క్లైమాక్స్ లో అరెస్టులు చేస్తున్నప్పుడు… సీఎం వాళ్లను డిపోల్లోకి పోనిస్తే బాగుండు అని సానుభూతిని అన్ కండిషనల్ గా ప్రకటించేశారు. మొదటికి… చివరికి జనంలో ఎంత మార్పు చూడండి. ఎందుకంటే వాళ్లు జనాలు. వాళ్లంతే. వాళ్లు బాధపడుతున్నా.. పక్కోడి సంతోషంలో ఆనందం వెతుక్కునే టైపు.

శారీరకంగా చెమటోడ్చారు

బస్సుతో ఉన్న అనుబంధమే జనం ఓపికకు పరీక్ష పెట్టింది. ప్రైవేటు బస్సులు తిప్పుతున్నారని బస్టాండ్లలో పడిగాపులు పడ్డారు. ప్రయాణాలు ఆలస్యమైనా ఓపిక చేసుకున్నారు. బస్సెంతసేపటికీ రాకపోవడంతో… బస్టాండ్లలోనే రాత్రిళ్లు గడిపారు. మధ్యలో అర్ధాంతరంగా ఆగిన ప్రైవేటు బస్సులతో తమ పనులు రద్దు చేసుకున్నారు. అలా.. దాదాపు 55రోజులుగా శారీరకంగానూ బస్సుతో ఇబ్బందిపడుతూనే తమ అనుబంధాన్ని కొనసాగించారు జనాలు.

ఆర్థికంగా బొక్క మీద బొక్క

దసరా పండక్కి బస్సులు బందైనప్పుడు జనం జేబుకు పెద్ద బొక్క పడింది. దాదాపు రెండు నెలల పాటు జేబులకు చిల్లుపెట్టుకుని.. ఉద్యోగాలకు వెళ్లారు.. ఊళ్లు తిరిగారు. ప్రైవేటు వాళ్లు అడిగినంతా ఇచ్చుకుని… ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఇపుడు సమస్య పరిష్కారం అయినా కూడా… చార్జీల భారం మళ్లీ తిరిగి తిరిగి జనంపైనే పడింది. ఇది వాళ్లు ఊహించని మరో పిడుగు లాంటిదే.

దాదాపు 2 నెలల తర్వాత.. ఇపుడు ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ జీతాలు పడ్డాయి. మరో రెండు నెలల సమ్మె కాలంలో శాలరీకి సీఎం గ్యారంటీ ఇచ్చేశారు. కఠినంగా కనిపించిన సీఎం కూడా మెత్తబడ్డారు. కార్మికుల బాధ కూడా మంచులా కరిగిపోయింది. కానీ…. ఆ రెండు వ్యవస్థలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ప్రజలు మాత్రం ఇలా మూడు రకాలుగా నష్టపోయారు. చివరకు చార్జీలు పెరిగినా… సర్దుకుపోయే తత్వం వాళ్లకుండటం ఈ వ్యవస్థ చేసుకున్న అదృష్టం. జనానికి పట్టిన దౌర్భాగ్యం.

Read Also : రేప్ కరెక్టే అన్నాడు.. ఫోన్ లో వణికిపోయాడు!! Smiley Nani ఫోన్ ఆడియో లీక్

(Visited 110 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *