CAA పొరుగు దేశాల ముస్లింలకు ఎందుకు పౌరసత్వం ఇవ్వదంటే..?

Spread the love

బుద్ధిస్టులు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు ఇతర మతస్తులను #CAB చట్ట సవరణ ఇండియా పౌరసత్వం వేగంగా అందిస్తోంది. ముస్లింలకు ఎందుకు రానివ్వడం లేదు, పౌరసత్వం అందివ్వదు అంటే.. చిన్న లాజిక్ తో అర్థం చేసుకోవచ్చు. ముస్లింలకు వారి వారి ఇస్లాం దేశాల్లో మైనారిటీ కారణాలతో.. మతం కారణంతో.. హింస, చంపడం లాంటి సంఘటనలు జరగడంలేదు. కాబట్టి వాళ్లకు ఆ దేశాల్లో థ్రెట్ లేదు. వాళ్లు ఇండియాకు రావాలనుకుంటే న్యాయంగా రావొచ్చు. ఇండియా రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం అనేందుకు ఒప్పుకుంటే రండి అని చట్టం చెబుతోంది. ముస్లింలను రానివ్వొద్దు అని చట్టంలో లేదు. కానీ.. లీగల్ గా రండి అని ఉంది. పాకిస్థాన్ నుంచి, ఆప్ఘనిస్థాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రమ్మనే చట్టం చెబుతోంది.  కానీ.. ఇల్లీగల్ గా రావడం మాత్రం కుదరదు.

ప్రాణభయంతో వచ్చే శరణార్థులతో పాటు.. ఐఎస్ఐఎస్, టెర్రరిస్టు, ఉగ్రవాద, జిహాదీ భావజాలం ఉన్నవాళ్లు కూడా బోర్డర్ దాటి ఇండియాలోకి రావొచ్చు. మన బోర్డర్స్ అంత సేఫ్ ఏమీ కాదు. ఇండియా బోర్డర్ చుట్టూ జిహాదీ పేరుతో గుంటనక్కల్లా దేశంలో చొరబడి దాడికి ఎదురుచూసే మూకలే ఎక్కువ. ఎవర్ని రానివ్వొచ్చు.. ఎవర్ని రానివ్వొద్దు అనే ఉద్దేశం కేంద్రానికి స్పష్టంగా ఉందని తెలుస్తోంది. ముస్లింల కోసమే ఆయాదేశాలున్నప్పుడు .. వాళ్లు అక్కడ బాగా ఉన్నప్పుడు.. కొందరు సెక్యులర్ కంట్రీ ఇండియాలోకి వచ్చి.. ఇండియన్ ముస్లింలతో ఇముడుతారా లేదా అన్నది సందేహాస్పదం. అలా వచ్చేవాళ్లలో సదుద్దేశంతో వచ్చే ముస్లింలే ఉంటారని అనుకోవడం ఓ అపోహ అవుతుంది. మన దేశంలోని అన్ని మతస్తులను కాపాడుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనుకోవడంలో తప్పులేదు.

(Visited 135 times, 1 visits today)
Author: kekanews