కృష్ణజింకలంటే బిష్ణోయిలు ఎంతో ఆరాధన
కృష్ణజింకలపై బిష్ణోయి తెగలకు అపారమైన తల్లి ప్రేమ
రెండు కృష్ణ జింకలను చంపారని సల్మాన్ ఖాన్ పై కోపం
26 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ పై కోపం పెంచుకున్న లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi)
సల్మాన్ ఖాన్ (Salman Khan) పై బిష్ణోయిలు పెంచుకున్న పగ ప్రతీకారం వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది. సినిమాను తలదన్నేంత ఉద్వేగం ఈ వివాదంలో దాగి ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రంలోని బిష్ణోయిలు ప్రధానంగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని సాగిస్తుంటారు. వన్యప్రాణులు, వృక్షాలపై ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటారు. బిష్ణో యిలకు-కృష్ణజింక(Krishna Jinka-Black Deer)ల మధ్య 550 ఏళ్లనాటి బంధం. గురు జంభేశ్వర్ (జంబాజీ) అనే గురువు బిష్ణోయ్ కమ్యూనిటీని స్థాపించారు. అతడి బోధనలు వన్య ప్రాణులు, వృక్ష సంపద సంరక్షణను హైలెట్ చేయడంతో బిష్ణోయిలు వాటిని అను సరించారు. కృష్ణజింకల్ని వీరు తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుడి పునర్జన్మగా భావిస్తుంటారు. తమ ఇంటికి వచ్చే కృష్ణజింకలను బిష్ణోయి మహిళలు సొంత పిల్లల్లాగే పెంచుతారు. దీనికి కారణం మరణించిన తర్వాత తాము కృష్ణజింకలుగా పుడుతామనే నమ్మకం వారిది.
Jayasudha : రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న జయసుధ.. అతడెవరో తెలుసా?
ఐతే.. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ(baba siddiqui) హత్యతో మరోసారి బిష్ణోయి కమ్యూనిటీ తెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్ కు ఆప్తమిత్రుడు సిద్ధిఖీ. ఈ సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్.. సల్మాన్ ఖాన్ ను ఎందుకు టార్గెట్ చేస్తోంది? దీనికి అసలు కారణం ఏంటి అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం.
అది 1998. సల్మాన్ ఖాన్ ‘హమ్ సాథ్ సాథ్ హై’ (hum saath saath hain) సినిమా షూటింగ్ కోసం జోధ్ పూర్ (jodhpur) వెళ్లారు. సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకల్ని వేటాడి చంపేశాడనే వార్తలు సంచలనం రేపాయి. కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఇది వివాదాంశంగానే ఉంది. అప్పటి నుంచి బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్ కు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో 5 ఏళ్ల వయసున్న లారెన్స్ బిష్ణోయ్.. ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్ గా మారి సల్మాన్ ఖాన్ని చంపేస్తానని హెచ్చరిస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది.
Devara : ఎన్టీఆర్ టార్గెట్ ఎవరు..? ఆ ‘హరి’ ఏం చేశారు..?
సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఖాను బెదిరింపులు పెరగడం, కృష్ణజింకలను చంపడం చుట్టూ ఉన్న దీర్ఘకాల వివాదాన్ని మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణజింకలను అత్యంత గౌరవంగా చూసుకునే బిష్ణోయి వర్గం వారు సల్మాన్ ఖాన్ చేసిన పనికి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సిద్ధిఖీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాను గట్టి భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీని మరింత టైట్ చేశారు.