Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ సక్సెస్ మీట్ సింపుల్ గా జరిగింది. భారీ ఈవెంట్లకు పోలీసులు అనుమతించకపోవడంతో.. సింపుల్ గా కనిచ్చేశారు. పెద్దగా స్పీచులు లేవు.. హైప్ లు లేవు.. ఏదో మాట్లాడి వెళ్లామంటే వెళ్లాం అన్నట్టుగా ఈవెంట్ చప్పగా సాగింది.
బాక్సాఫీస్ వద్ద దేవర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కొరటాల శివ ఈ చిత్ర విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. సైఫ్ అలీఖాన్ కు తెలుగులో ఫస్ట్ హిట్ దక్కింది. మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా దేవర రూ. 407 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీయార్ ఆర్ట్స్ మాట్లాడుతూ ‘ ముందుకు ఎప్పుడు రాడు, చాలా మంది అతనిని సరిగా అర్ధం చేసుకోరు అతడే మా హరికిషన్. ఎవరేమి అన్నా, అనుకున్నా సరే ఎన్టీయార్ ఆర్ట్స్ కు మూలస్తంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి స్ట్రెంత్ హరి, నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. లేదంటే లేదు’ అని అన్నారు.
హరి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హరి(Harikrishna Kosaraju).. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyanram) బావమరిది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను కళ్యాణ్ రామ్ కొన్నేళ్ల కిందట స్థాపించారు. ఐతే.. ఈ బ్యానర్ ఆపరేషన్స్ అన్నీ హరి చూస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను నిర్మించింది కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీదే. ఈ మూవీ అప్ డేట్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్ నిర్వహణలో ప్రొడ్యూసర్ హరి సరైన ఏర్పాట్లు చేయడం లేదని.. ఎన్టీఆర్ ను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని కొందరు అభిమానులు తారక్ కు కంప్లయింట్ ఇచ్చారు. ఈ ఆరోపణలపైనే ఎన్టీఆర్ స్పందించారు.
హరి వచ్చాకే ఫ్యాన్స్ కు తారక్ కు మధ్య గ్యాప్ వచ్చిందని ఎప్పుడో నుండో టాక్ ఉంది. హరిని తీసేయాలని ఫ్యాన్స్ ఆ మధ్య గొడవ చేసారు. దేవర ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ‘X’ లో స్పేస్ లు పెట్టి మరి హరిని తిట్టారు. బహుశావారందరికి ఆన్సర్ ఈ రూపంలో తారక్ చెప్పాడని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.
"ఎవరేమన్నా… ఎవరేమనుకున్నా…. NTR Arts కి స్తంభం.. హరి "
– #JrNTR warns some of his fans who are going against producer Hari on social media. pic.twitter.com/ufW5g8zHZ9
— Gulte (@GulteOfficial) October 4, 2024