Simple Analysis : సిటిజన్ అమెండ్ మెంట్ చట్టం(CAA)లో ఏముంది..?

Citizenship Amendment Act AmitShah Kekanews
Spread the love

సిటిజన్ అమెండ్ మెంట్ బిల్లు(Citizenship Amendment Bill -CAB) పార్లమెంట్ ఆమోదం పొందింది. పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. దీనిపై ఈశాన్య రాష్ట్రాల్లోనూ బెంగాల్ లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసలు.. Citizen Amendment Bill ఏం చెబుతోంది..  రాష్ట్రాల అభ్యంతరాలేంటి… ఇది అమలైతే ఏం జరుగుతుందో ఓసారి తెల్సుకుందాం.

పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లనుంచి వచ్చి భారత్ లో ఉంటున్న హిందూ, సిక్కు, పార్సి, బౌద్దులు, క్రిస్టియన్ వలసదారుల పౌరసత్వాన్ని పునర్ నిర్వచించేందుకు పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం. అంతకుమందు 12ఏళ్లు ఇండియాలో నివాసం ఉండాలన్న నిబంధనను ఆరేళ్లకు కుదించింది.

భారత్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి భారత్ పొరుగు దేశాలు ఇస్లాం రిలీజియస్ స్టేట్స్. అవన్నీ స్వయం ప్రకటిత ఇస్లాం కంట్రీలు. ఇండియాలాగా అవి సెక్యులర్ దేశాలు కావు. ఇండియా రాజ్యాంగంలోనే ఉంది మనది సెక్యులర్ కంట్రీ అని. ఆ ముస్లిం కంట్రీస్ లో ప్రాణభయంతో హింసకు గురై ఇండియాలో ఉంటున్న అక్రమ వలస దారులకు ఫాస్ట్ ట్రాక్ లో భారత పౌరసత్వం అందించేందే #CAB. మనదేశ ప్రజలు కాకపోయినప్పటికీ.. ఈ దేశాల్లో ప్రజలు మనతో సనాతన, సాంస్కృతిక జీవనాన్ని, వాల్యూస్ ను షేర్ చేసుకుంటున్నారు. మానవీయ కోణంలో వారికి దేశ పౌరసత్వం అందివ్వాలనుకుంటోంది భారతదేశం.

పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం… పొరుగుదేశం వదిలే అందరికీ ఇండియా షెల్టర్ ఇవ్వడం లేదు. ఏ దేశమైతే అక్కడి స్థానికుల మతాన్ని గౌరవించక, వేధింపులకు పాల్పడుతుందో.. అలాంటి వాళ్లకు మాత్రమే ఈ చట్టం ఇండియాలోకి రానిస్తుంది. ఈ చట్టం ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ ముస్లిం దేశాలనుంచి వేధింపుల కారణంగా ఇండియాకు వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకే పౌరసత్వం అందివ్వబడుతుంది.

(Visited 222 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *