Pottel : టీజర్ తోనే బజ్ క్రియేట్ చేసిన పొట్టేల్(Pottel) మూవీ ట్రైలర్ విడుదలైంది. రా అండ్ రస్టిక్ మెటీరియల్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. బలమైన ఎమోషన్ డ్రామా, యాక్టర్స్ పెర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, బీజీఎంతోపాటు.. పెంచలదాసు పాట ట్రైలర్ ను సూపర్ హిట్ చేశాయని చెప్పొచ్చు. అజయ్(Ajay) లుక్ మాత్రం ఔట్ అండ్ ఔట్ అదిరిపోయిందని చెప్పాలి.
Salman Khan : సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్.. మధ్యలో జింక..! ఒళ్లు గగుర్పొడిచే స్టోరీ
1980 కాలం నాటి తెలంగాణలోని పరిస్థితులను మనకు ఈ సినిమాలో చూపెట్టనున్నారు. పక్కా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషన్ రైడ్‌గా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. తన కూతురు చదువు కోసం ఓ తండ్రి ఎదుర్కొనే సమస్యలు.. ఓ పొట్టేలు వారికి ఎలాంటి అడ్డంకులను తెచ్చిపెట్టిందనేది ఈ సినిమా కథగా రాబోతుంది.
టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇదే జాబితాలో ఇప్పుడు ‘పొట్టేల్’ అనే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోంది. యువ చంద్రా కృష్ణ (Yuva Chandra), అనన్య నాగళ్ల(Ananya Nagalla), అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సాహిత్ మోత్కూరి(Sahit Mothkhuri) డైరెక్ట్ చేశాడు.
Jayasudha : రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న జయసుధ.. అతడెవరో తెలుసా?
ఈ ట్రైలర్‌లోని రా అండ్ రస్టిక్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించగా నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అక్టోబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.