YouTube Ads : ఏ విషయం కావాలన్నా, సమాచారం తెలుసుకోవాలన్నా, వింతలు విశేషాలు చూడాలన్నా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం యూట్యూబ్ ద్వారా సులభంగా దొరుకుతోంది. యూట్యూబ్ కూడా తమ యూజర్లకు అనేక సేవలు అందిస్తూ ముందుకు దూసుకుపోతోంది. యూట్యూబ్ కొత్త పాజ్ యాడ్స్ అనే కొత్త అడ్వర్టైజింగ్ ఫీచర్ ను తీసుకువచ్చింది.
KCR vs Revanth Reddy : కేసీఆర్ నిర్మాణాల్లో భారీ అవినీతి.. ‘వెలుగు’ సంచలన కథనం
యూజర్లను వీడియోను పాజ్ చేసినప్పుడు.. ప్రకటనలు వచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ విషయాన్ని యూట్యూబ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ఒలువా ఫలోడున్ వెల్లడించారు. కొత్త ప్రకటన ఫార్మాట్తో యూజర్లకు తక్కువ ప్రకటనల అంతరాయం కలుగుతుందన్నారు. ఈ కొత్త పాజ్ యాడ్ ఫీచర్ తీసుకురావడానికి యూట్యూబ్ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
Article 370 : ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు : అమిత్ షా సంచలనం
ముఖ్యంగా ప్రకటన దారులు దీనిపై ఎంతో ఆసక్తి కనబరిచారు. ముందుగా 2023లో కొందరు ప్రకటన దారు లతో దీన్ని పరీక్షించారు. వారందరికీ నుంచీ ఈ పాజ్ యాడ్ ఫీచర్ ను మంచి స్పందన లభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.