KCR vs Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటేరియెట్ నిర్మాణం దాకా అన్నిట్లో గత బీఆర్ ఎస్ సర్కార్ మొదట తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.
Article 370 : ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు : అమిత్ షా సంచలనం
దాదాపు అన్నిట్లో నాసిరకం పనులు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది రేవంత్ ప్రభుత్వం. ఇలా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత పాలకులు వృథా చేశారని, ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది అంటూ ప్రముఖ దినపత్రిక వెలుగు సంచలన కథనం ప్రచురించింది. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ వ్యవహారంలో జ్యుడీషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది. మరికొన్నింటిపై విజిలెన్స్, ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది.