త్రివిక్రమ్ అరిపించేశాడుగా.. సామజవరగమన ప్రోమో సాంగ్

Allu Arjun Ala Vaikunthapuramulo
Spread the love

సామజవరగమన.. నిను చూసి ఆగతరమా.. మనసుమీద వయసుకున్న అదుపు చెప్పతగునా… అలవైకుంఠపురములో మూవీలోని ఈ పాట మామూలు హిట్ కాలేదు. ఇటీవల కాలంలో .. అన్ని ట్రెండ్స్ ను బద్దలు కొట్టి.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ పాట. తమన్ అందించిన ఈ ట్యూన్ ఇప్పటికే కోట్లాది మంది మనసు గెల్చుకుంది. సిద్ శ్రీరామ్ గాత్రం… తమన్ అద్భుతమైన మెలడీకి.. త్రివిక్రమ్ టేకింగ్ జోడిస్తే ఎలా ఉంటుందో అనుకున్నారు ఫ్యాన్స్. అంచనాలను మించి.. పాట ప్రోమో ఆన్ లైన్ లో దుమ్ములేపుతోంది.

సామజవరగమన.. పాట ప్రోమోను డిసెంబర్ 31నాడు న్యూ ఇయర్ గిఫ్ట్ గా అందించారు మేకర్స్. పాటలో.. లొకేషన్లు కిర్రాక్. అల్లు అర్జున్ స్టైలింగ్.. స్టెప్పులు..సింప్లీ సూపర్బ్. పూజా హెగ్డే అందం మైండ్ బ్లోయింగ్. త్రివిక్రమ్ టేకింగ్ వంకపెట్టలేనిదిగా ఉంది.

సామజవరగమన.. ఒక్కటే కాదు… మూవీలోని అన్ని పాటలు అంచనాలను మించి హిట్ కావడంతో.. అల వైకంఠపురముంలో మూవీపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది జోనర్ లోనే ఈ మూవీ కూడా ఉంటుందని అనిపిస్తున్నా.. త్రివిక్రమ్ ఏదైనా మ్యాజిక్ చేయకపోతాడా అన్నది అభిమానుల నమ్మకం. పాటలు బంపర్ హిట్ కావడంతో.. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

(Visited 216 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *