#CAB: ముస్లింలు కాకుండా ఇతర మతస్తులు ఇల్లీగల్ గా రావొచ్చా..?

Citizenship Amendment Act AmitShah Kekanews
Spread the love

పొరుగు దేశాల్లో మతం పేరుతో దాడులు చేస్తుంటే.. ప్రాణభయంతో ఓ మనిషి సరిహద్దు దాటుతుంటే లీగలా..ఇల్లీగలా అనే ప్రశ్న అనవసరం. అలాంటి రెఫ్యూజీ, శరణార్థుల ప్రాణాలు కాపాడటం ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో వచ్చే వ్యక్తికి ఇండియా షెల్టర్ ఇస్తోంది.

రెఫ్యూజీ(జాతి, మతం, రాజకీయ హింసతో శరణం కోరేవారు) స్టేటస్ ఇచ్చినంత మాత్రాన ఓటింగ్ రైట్స్, పొలిటికల్ రైట్స్, సివిల్ రైట్స్ లాంటివేవీ రావు.  యాంటీ ముస్లిం అని చెప్పడం చాలా అన్యాయం. ఇలాంటి చట్టం తెచ్చినందుకు ఇండియాలో ఉన్నందుకు నిజంగా గర్వపడాల్సిన సమయం ఇది.

పొరుగుదేశం విడిచి రాగానే పౌరసత్వం ఇస్తారా..?

వచ్చేది హిందువైనా, క్రిస్టియనైనా… ప్రాణభయం  ఉందనే భావనతో వస్తేనే ఇక్కడ రెఫ్యూజీగా రాణిస్తోంది చట్టం. వెంటనే వారికి భారత పౌరసత్వం దక్కదు. ఆరేళ్లు ఇండియాలో నివాసం ఉండాలి. రాజ్యాంగం ప్రకారం, సిటిజన్ షిప్ బిల్లు ప్రకారం ఉంటున్నావా లేదా అనేది అధికారులు తేల్చుతారు. డిసెంబర్ 14, 2014కంటే ముందు వచ్చినవాళ్లు.. కనీసం ఆరేళ్లు(గతంలో 12ఏళ్లు ఉండేది) ఇండియాలో ఉన్నట్టయితే.. వాళ్లకు పౌరసత్వం ఇచ్చే అంశం పరిగణలోకి వస్తుంది.

(Visited 91 times, 1 visits today)
Author: kekanews