కేక రివ్యూ : ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ దద్దరిల్లిపోయింది

SariLeru Neevvaru Trailer
Spread the love

అందరూ ఎదురుచూస్తున్న మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ ట్రైలర్ విడుదలైంది. అంచనాలను మరింతగా పెంచేస్తూ… ట్రైలర్ లో చెప్పినట్టుగానే నిజంగానే దద్దరిల్లిపోయింది. పక్కా కామెడీ మాస్ ఎంటర్ టైనర్ గా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కిందని మేకర్స్ ముందునుంచీ చెబుతూనే ఉన్నారు. ఎమోషన్స్, ఎలివేషన్స్.. అద్భుతంగా కుదిరాయి. ట్రైలర్ ను సీన్ బై సీన్ ఓసారి రివ్యూ చేద్దాం.

2.24 సెకన్ల ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పర్ఫెక్ట్ గా కట్ అయింది ట్రైలర్. 1.08 సెకన్ల పాటు కామెడీని చూపించారు. ఆ తర్వాతనుంచి… అసలైన యాక్షన్ మొదలవుతుంది.

Sarileru neekevvaru Trailer Review (8)

రవితేజ ‘వెంకీ’ సినిమాలో రైల్లో కామెడీ కోట్లాదిమందికి ఫేవరిట్. మరోసారి అలా రైలులో కామెడీతో కేక పెట్టించేందుకు అనిల్ రావిపూడి రెడీ అయిపోయాడు. రష్మిక, సంగీత, బండ్లగణేశ్, రాజేంద్రప్రసాద్ ఈ బ్యాచ్ తో మహేశ్ చేసే అల్లరి మామూలుగా లేదు. అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో కామెడీకి ఓ స్టైల్ ఉంటుంది. ప్రతి సినిమాలోలాగే.. సరిలేరులోనూ ఓ మేనరిజమ్ ను ఆయన చూపించాడు. హీరోయిన్ రష్మిక .. నీకు అర్థమవుతోందా… అని స్వీట్ గా రష్మిక అడగడంతోనే ట్రైలర్ రిజిస్టర్ అయిపోతుంది. ఆ తర్వాత.. Never Befor.. Ever After డైలాగ్ కూడా బాగా కుదిరింది. జనాలు ఇంప్రెస్ అయిపోతారు. మగాళ్ల మాట మేం అస్సలు వినంగా.. అంటూ బండ్లగణేశ్ మరోసారి తెరపై తనమార్క్ కామెడీతో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.

మూవీ కర్నూలుకు షిఫ్ట్ అవుతుంది. కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’ మార్క్ తో ప్రకాశ్ రాజ్ విలనీని చూపించారు. బురుజు దగ్గర ఫైట్ మెరుపులా చూపించారు కానీ.. థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టేజీపై చెప్పాడు. దీంతో.. ఆ ఫైట్ ఆసక్తి రేపుతోంది.

Sarileru neekevvaru Trailer Review (8)

నీ కాలేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా.. స్టేట్ మినిస్టర్ ను ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రకాశ్ రాజ్ భారతి క్యారెక్టర్ చేసిన గవర్నమెంట్ ఆఫీసర్ విజయశాంతిని బెదిరిస్తాడు. అదే సీన్ లో… ప్రకాశ్ రాజ్ స్టైల్లోనే కుర్చీని వెనక్కి తంతూ మహేశ్ బాబు ‘ఏయ్.. కాలేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా.. స్టేట్ మినిస్టర్ వి. లేడీస్ తో ఏం మాట్లాడుతున్నావ్..‘ అంటూ బెదిరించే సీన్ వస్తుంది. ఈ సీన్ దుమ్ములేపిందంతే.  ఆ తర్వాత వచ్చే ఆర్ఆర్ కూడా కిర్రాక్ .

మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు. మీకోసం ప్రాణాలు ఇస్తున్నాం అక్కడ(బోర్డర్ లో). మీరేమో అడ్డమైన పనులు. బాధ్యత ఉండక్కర్లా.. అని నాయకులను ప్రశ్నించే సైనికుడిగా మహేశ్ బాబు బాబు సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.

చిన్న బ్రేక్ ఇస్తున్నాను. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది డైలాగ్ తో ట్రైలర్ నిజంగానే దద్దరిల్లిపోతుంది. చివర్లో లుంగీ ఎత్తి మాస్ లుక్కులో కనిపించిన మహేశ్ అభిమానులకు ఐ  ఫీస్ట్ అందించాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానున్న సరిలేరు నీకెవ్వరు మూవీకోసం అభిమానులు, సినీ ప్రేమికులు అందరూ ఎదురుచూసేలా చేసేలా ఉంది ట్రైలర్.

(Visited 144 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *