అల్లు అర్జున్ – పూజాహెగ్డే కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురములో… సూపర్ హిట్ అయింది. సామజవరగమన సహా.. మూవీలోని పాటలకు థియేటర్ లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటల లిరికల్ సాంగ్స్ కే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. ఇపుడు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
Samajavaragamana Full Vido Song ను ఇలా రిలీజ్ చేశారో లేదో.. అలా.. లక్షల్లో వ్యూస్ పడ్డాయి. పూర్తి పాటను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. మరోసారి యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది ఈ పాట. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. తమన్ చేసిన మ్యూజిక్ మ్యాజిక్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్స్.