రామ్ గోపాల్ వర్మ తగ్గడం లేదు. అమృత-ప్రణయ్ ప్రేమ కథ, తర్వాత తీవ్రమైన పరిణామాలపై ఆయన సినిమా తీసేందుకే నిర్ణయించుకున్నారు. అమృతతో కొంత కాన్ ఫ్లిక్ట్ తర్వాత… రామ్ గోపాల్ వర్మ.. తన Murder సినిమాపై మరిన్ని వివరాలు సోషల్ మీడియాలో వెల్లడించారు.
తాజాగా ట్విట్టర్ లో Amritha Pranay ల స్టోరీ లైన్ ఆధారంగా తీస్తున్న Murder సినిమాకు సంబంధించిన లేటెస్ట్ వివరాలు తెలిపారు.
మారుతి రావు రాసిన అమృత ప్రణయ గాథ అనేది తన కథకు పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ అవుతుందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. తీవ్రమైన భావోద్వేగాలతోనే తన మర్డర్ సినిమా ఉంటుందని వర్మ చెప్పారు. అతి ప్రేమ.. అతి ద్వేషం.. ఎలాంటి పరిణామాలకు దారీతీస్తాయన్నదే తన స్టోరీ అన్నారు. ఈ రెండు అతి హింసకు ఎలా దారీతీశాయన్నది మర్డర్ లో ఉంటుందన్నారు వర్మ.
మారుతీరావు వధించిన ప్రణయామృత విషాద గాథ త్వరలో మీ ముందుకు వస్తోందని టీజ్ చేశాడు వర్మ. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా ఆయన రిలీజ్ చేశారు. అవి ఆకట్టుకుంటున్నాయి.
A very apt description for the story of MURDER “మారుతి రాసిన అమృతప్రణయ గాధ” pic.twitter.com/UeMk4PVeB9
— Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020
MURDER is a story of extremes ..EXTREME LOVE resulting in EXTREME HATE and culminating in EXTREME VIOLENCE #LoveCanMURDER pic.twitter.com/7SN7fS9uUZ
— Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020