కేక రివ్యూ : డిస్కో రాజా

Disco Raja Review And Rating
Spread the love

Disco Raja Rating :

రవితేజ – 4

కేవీ ఆనంద్ ఐడియా- 4.5

డైరెక్షన్ & ఐడియా ఇంప్లిమెంటేషన్ – 2

వెన్నెల కిశోర్-3

తమన్ – 4.5

ఓవరాల్ రేటింగ్  – 3

రవితేజ అంటేనే ఎనర్జీ. ఆ ఎనర్జీకి మంచి కంటెంట్ తోడైతే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. రాజా ది గ్రేట్ లో అదే జరిగింది. హీరోకు కళ్లు లేకపోయినా.. టెక్నిక్.. పకడ్బందీ స్క్రీన్ ప్లేతో దుమ్ములేపింది ఆ మూవీ. ఇంప్లిమెంటేషన్ కన్నా .. డైరెక్టర్ థాట్, మేకింగ్ బాగుంది అనిపిస్తుంది.

డిస్కో రాజాగా మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో అలరించాడు. తన కామెడీ టైమింగ్ తో కూడా బాగా ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా గత తన సినిమాల కంటే చాలా స్టైలిష్ గా ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ లకు తక్కువ స్క్రీన్ టైమ్ ఇచ్చారు.  ఐతే… తమ గ్లామర్ తో అభిమానులను మెప్పించారు నభా, పాయల్. తాన్యా హోప్ కూడా పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది.

కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో సినిమా ఆసాంతం నవ్వించారు. వెన్నెల కిశోర్ మూవీకి చాలా సపోర్ట్ ఇచ్చాడు.

దర్శకుడి పనితనం ఓకే

దర్శకుడు ఆనంద్ తన శైలికి తగ్గట్లుగానే ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడిపించాడు.  సైన్స్ ఫిక్షన్ డ్రామాగా మలిచే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన దర్శకత్వ పనితనం బాగుంది అనిపిస్తుంది.

సైన్స్ ఫిక్షన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ నే తీసుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. డిస్కో రాజా క్యారెక్టరైజేషన్ ను … రవితేజ పాత్రల మధ్య ఎమోషన్ ను ఇంకా బాగా బలంగా ఎలివేట్ చేయాల్సింది. అలాగే క్లైమాక్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను ఎడిట్ చేసి ఉంటే… సినిమా ఇంకాస్త స్కోరు చేసి ఉండేదనిపిస్తుంది.

డిస్కోరాజాలో సినిమాటోగ్రఫీ సూపర్. కెమెరామెన్ చాలా అందంగా ఫ్రేమింగ్ చేశాడు.

ప్రాణం పెట్టిన తమన్

మూవీకి రెట్రో లుక్ తేవడంలో తమన్ చాలా కష్టపడ్డాడు. డిస్కో నేటివిటీ కోసం ఆయన ఇచ్చిన రీరికార్డింగ్, మ్యూజిక్ మాత్రం హైలైట్. తమన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. మెయిన్ గా డిస్కో రాజా సాంగ్ అయితే అదుర్స్ అనే చెప్పాలి. మేకింగ్ వాల్యూస్ అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి.

రవితేజ ‘డిస్కో రాజా’ అంటూ వచ్చి తన ఆటిట్యూడ్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో కూడా బాగా ఆకట్టుకున్నాడు. మెయిన్ గా తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమాని తన భుజాలపై మోశాడు. అయితే దర్శకుడు డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చినా… దానిని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడనిపిస్తుంది.

పంచ్ లైన్… డిస్కోరాజా.. ఓసారి తప్పక చూడొచ్చు.

(Visited 147 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *