బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ తన కెరీర్ బెస్ట్ పాత్రను పోషించారు. ఇపుడు తమిళనాడు ప్రజలు అమ్మగా కొలిచే జయలలిత రోల్ లో నటిస్తున్నారు. జయలలిత బయోగ్రఫీతో కంగనారనౌత్ – తలైవిగా… నిత్యామీనన్ లీడ్ రోల్ లో ఐరన్ లేడీ సినిమాలు వస్తున్నాయి. ఇంతలోనే రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో క్వీన్ సినిమాను ప్రకటించి టీజర్ రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్… జయలలిత వర్ధంతిరోజున ట్రైలర్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు.
See Also : మారుతి మార్క్ కామెడీతో ‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్
తలైవి, ఐరన్ లేడీ సినిమాలైతే… క్వీన్ వెబ్ సిరీస్ MX Original Series గా రూపొందిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రసాద్ మురుగేషన్ ఇద్దరు క్వీన్ కు దర్శకులు. జయలలిత లైఫ్ లో.. స్టూడెంట్ గా, హీరోయిన్ గా, పాలిటీషియన్ గా … 3 దశల్లో ఆమె సక్సెస్ ను వెబ్ సిరీస్ గా తీస్తున్నారు మేకర్స్.
జయలలిత బయోగ్రఫీ అయినప్పటికీ… ఈ వెబ్ సిరీస్ లో పేర్లు మార్చారు. ఇందులో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి శేషాద్రి. ఎంజీఆర్ కాకుండా జీఎంఆర్ అనే పాత్రను చూపించారు. ఇలా.. పాత్రలకు పేర్లు మార్చి ఆమె జీవిత ఘట్టాలను చూపిస్తున్నారు. రమ్యకృష్ణ పెర్ఫామెన్స్ ఇరగదీసిందని తమిళ ప్రేక్షకులు అంటున్నారు. బక్కపలుచని భామ కంగనకు వేసిన ప్రోస్తటిక్ మేకప్ ను మెచ్చని తమిళ ప్రేక్షకులు.. నిత్యామీనన్ ను మాత్రం ఓకే చేశారు. ఇపుడు రమ్యకృష్ణ హుందాతనానికి.. ఆమె నటనకు ఫిదా అయిన తమిళ తంబీలు.. జయ పాత్రకు ఈమే పర్ఫెక్ట్ గా కుదిరారని అంటున్నారు.
See Also : కంగన రనౌత్ తలైవి టీజర్ చూడండి
See Also : నిత్యామీనన్ ఐరన్ లేడీ స్కెచ్ చూడండి