మారుతి మార్క్ కామెడీతో ‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్

Spread the love

దర్శకుడు మారుతి సినిమాల్లో వినోదానికి గ్యారంటీ ఉంటుంది. సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా కాంబినేషన్ లో ఆయన రూపొందించిన ప్రతిరోజు పండగే సినిమా ట్రైలర్ కూడా వినోదాన్ని పంచుతోంది. లేటెస్ట్ గా రిలీజై యూట్యూబ్ లో టాప్ లో ట్రెండింగ్  ఉందీ ప్రతిరోజూ పండగే మూవీ ట్రైలర్.

సత్యరాజ్ ది తాతయ్య పాత్ర. ఆయన కొన్నిరోజుల్లో చనిపోతారని తెలిసి విదేశాల్లో ఉన్న కొడుకులు తప్పనిసరిపరిస్థితుల్లో రావాల్సి ఉన్నా.. రారు. దీంతో.. చివరిరోజులో తాతకు తోడుగా మనవడు ఉండాలనుకుంటాడు. మనవడి జోరుతో.. తాత అనారోగ్యం తగ్గిపోయి.. హుషారుగా అవుతాడు. అలా.. కుటుంబ విలువలపై ఈ మూవీ ఉండబోతోందని ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది.

భలేభలే మగాడివోయ్ లాంటి హిట్ సినిమా తర్వాత…  ఫ్యామిలీని ఆకట్టుకునే సినిమాలు తీస్తున్నారు. ఇటీవల బాబూ బంగారం, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు కమర్షియల్ సక్సెస్ లు కొట్టారు. ఈ జానర్ లోనే ఆయన తీస్తున్న ప్రతిరోజూ పండగే మూవీ రిలీజ్ కు రెడీ అయింది. టైటిల్ పెట్టినప్పుడే ఇదో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించింది. మూవీ ట్రైలర్ కూడా అలాగే ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్లు ఖాతాలో వేసుకుంటున్న తమన్ ఈ మూవీకి అందించిన పాటలు ఇప్పటికే మార్మోగుతున్నాయి..

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి ఫ్యామిలీ రీ యూనియన్ కాన్సెప్ట్ లో సక్సెస్ కొట్టాయి.  ప్రతిరోజు పండగే మూవీ లైన్ కూడా అలాగే ఉంది. ఐతే… ఎంటర్ టైన్ మెంట్ మూవీకావడంతో.. కంటెంట్, కథనం ఎలా ఉంటాయన్నదానిపైనే మూవీ రన్, సక్సెస్ ఆధారపడి ఉంటాయి. ఈ నెల మూడోవారంలో #PratiRojuPandage Movie రిలీజ్ అవుతుంది.

Read Also : కేసీఆర్ దగ్గర జాబ్ అప్లై చేసుకున్న గద్దర్

(Visited 146 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *