Allu Arjun Arrest : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర వద్ద డిసెంబర్ 4, 2024 బుధవారం రోజున జరిగిన తొక్కిసలాట కేసులో పుష్ప-2 (Pushpa 2) కథానాయకుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ ప్రాణం పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.
సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ వేశారు అల్లు అర్జున్. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ని సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. భారీగా వచ్చిన జనం తోసుకుని తోపులాడుకుంటూ థియేటర్లోకి చొచ్చుకువెళ్లడంతో రేవతి అనే మహిళ వారి కాళ్ల కిందపడి నలిగి ఊపిరాడక స్పాట్ లోనే కన్నుమూసింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ కేసుతో సంబంధం లేదని అల్లు అర్జున్,సంధ్య యాజమాన్యం కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండాపోయింది.