కేసీఆర్ దగ్గర జాబ్ అప్లై చేసుకున్న గద్దర్

Gaddar
Spread the love

ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్.. తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థలో ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. తన పాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని ఉర్రూతలూగించి… తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహం నింపిన గద్దర్.. ఇపుడు ఓ సామాన్య సాంస్కృతిక కళాకారుడి ఉద్యోగానికి అప్లై చేసుకోవడం విడ్డూరమే.

ఈ ప్రయత్నంతో ప్రభుత్వంపై గద్దర్ తన నిరసనను తెలిపారని మరికొందరు మేధావులు చెబుతున్నారు. మంగళవారం నాడు గద్దర .. మాదాపూర్ లోని తెలంగాణ సాంస్కృతిక సారథి ఆఫీస్ కు వెళ్లారు. గద్దర్ బయటే వెయిట్ చేశాడు. ఆయన అనుచరుడు లోపలికి వెళ్లి ఉద్యోగానికి దరఖాస్తును… సంస్థ రిక్రూట్ మెంట్ సెక్రటరీ శివకుమార్ కు అందజేశారు. ఐతే.. ఈ అప్లికేషన్ ను సంస్థ రిజెక్ట్ చేసింది.

సాంస్కృతిక సారథిలో జాబ్ అప్లై చేసుకోవాలంటే ఓ ఫార్మాట్ ఉంది. అలా కాకుండా.. తన లెటర్ హెడ్ పై గద్దర్ ఉద్యోగం కోసం ఓ విజ్ఞాపన రాసి అప్లికేషన్ పెట్టుకున్నారు.

అందులో..

“గౌ. శివకుమార్ గారూ..

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల నియామక కమిటీ

అన్నా..

విషయం : ఉద్యోగం కోసం

నా పేరు గద్దర్. గాయపడ్డ ప్రజల పాటను నేను. చిన్నప్పటినుంచి జనం పాటలు పాడుతున్నాను. రాయడం- పాడటం-ఆడటం నా వృత్తి. నా దగ్గర ఇప్పుడు ఎలాంటి సర్టిఫికెట్లు లేవు. సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా ఉద్యోగం ఇప్పించగలరు.”

అని లెటర్ లో రాశారు గద్దర్. లెటర్ రిజెక్ట్ అయిందని తెలిసి… గద్దర్ అక్కడినుంచి వెళ్లిపోయారు.

గద్దర్ ప్రస్తుత వయసు 73 ఏళ్లు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొన్నాళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నారు.  ఇపుడు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడంపై చర్చ జరుగుతోంది.

(Visited 130 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *