తమన్ రాకింగ్.. ఇంకో లెవెల్ సాంగ్ ఇచ్చాడుగా.. !

Prai Roju Pandage Thaman Music
Spread the love

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్రెండ్ అడ్డులేకుండా కొనసాగుతోంది. విడుదలైన ప్రతి పాట కూడా హిట్ టాక్ తెచ్చుకుంటోంది.  ప్రతిరోజూ పండగే సినిమాలో You Are My High లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట ఇలా రిలీజైందో కాలేదో.. అలా వైరల్ అయిపోయింది. పాజిటివ్ వైబ్రేషన్స్ తో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Thaman ఫాస్ట్ బీట్… కలర్ ఫుల్ సెట్టింగ్స్… అదిరే స్టెప్పులు.. మధ్యలో మెలోడీ ట్యూన్… రాశీఖన్నా హస్కీ గొంతు… ఇలా.. ఒక్కొక్కటీ ఒక్కో వేరియేషన్. న్యూ లెవెల్ సాంగ్ ను తమన్ ఇచ్చాడనిపిస్తోంది. పాటలో కొంత భాగం ఎక్కడో విన్నట్టుగానగే అనిపించినప్పటికీ.. తమన్ చూపించిన వేరియేషన్ ఓవరాల్ సాంగ్ ను స్పెషల్ గా నిలబెట్టింది.

సాయితేజ్, రాశిఖన్నా జంటగా నటించిన PratiRoju Pandaage మూవీ త్వరలోనే రిలీజ్ అవుతోంది. మారుతి దర్శకత్వం వహించాడు. శ్రీజో ఈ పాట రాశారు. రాశీఖన్నా గొంతులో ఈ పాట స్పెషల్ గా అభిమానులను అలరిస్తోంది. ఈ మూవీలో తమన్ అందించిన పాటలన్నీ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

Read Also : ఆంటీ కాదు ఇంకా అమ్మాయే..! సన్నబడిన సన్నీలియోన్

(Visited 96 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *