KCR క్యాంప్ ఆఫీస్‌లో కుక్క మృతి… డాక్టర్‌పై కేసు నమోదు

Spread the love

సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్‌ లో జరిగిన సంఘటన రాష్ట్రమంతా హాట్ టాపిక్ అయింది. క్యాంప్ ఆఫీస్ లో ఉండే 9 పెంపుడు కుక్కల్లో హస్కీ అనే కుక్క ఇవాళ చనిపోయింది. దాని వయసు 11 నెలలు. పదో తేదీన కుక్క హస్కీ జబ్బుపడింది. క్యాంప్ ఆఫీస్ లో ఉండే కుక్కల హ్యాండ్లర్ ఆసిఫ్ ఆలీఖాన్ దానికి ప్రాథమిక చికిత్స చేశాడు. బహదూర్ పురా ఏరియాకు చెందిన ఆసిఫ్ ఆలీఖాన్.. ఐదేళ్లుగా క్యాంప్ ఆఫీస్ లో డాగ్ హ్యాండ్లర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 11వ తేదీన సడెన్ గా మళ్లీ కుక్క చేతకాకుండా డల్లైపోయింది. వెంటనే రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్ ను పిలిపించారు. కుక్కకు హై ఫీవర్ ఉండటంతో… లివర్ టానిక్ ఇచ్చాడు. ఆ తర్వాత కుక్క హస్కీ ఆరోగ్యం మరింత క్షీణించింది.
అదే రాత్రి 8 గంటల టైమ్ లో… కుక్క హస్కీని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని యానిమర్ కేర్ టేకర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ రంజిత్ .. చికిత్స అందిస్తుండగా… కుక్క హస్కీ చనిపోయింది. దీంతో.. డాక్టర్ నెగ్లిజెన్సీ కారణంగానే క్యాంప్ ఆఫీస్ లో పెంపుడు కుక్క చనిపోయిందని ఆసిఫ్ ఆలీఖాన్ బంజారాహిల్స్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు…. డాక్టర్ పై కేసు ఫైల్ చేశారు.
అదీ సంగతి. క్యాంప్ ఆఫీస్ లో కుక్క జ్వరంతో చనిపోతే .. డాక్టర్ పై కేసులు పెడుతున్నారు కానీ.. సామాన్య ప్రజలు జ్వరంతో చనిపోతే బాధ్యులుగా ఎవరిపైనా కేసులు పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరిపై కేసులు పెట్టారు…. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే ఎవరి పై కేసులు పెట్టారు…. రైతులకు గిట్టుబాటు ధర లేక చనిపోతే ఎవరిపై కేసులు పెడుతున్నారు…. అని ప్రశ్నిస్తున్నారు జనాలు. బయట సామాన్యుని బతుకు కన్నా కేసీఆర్ ప్రగతిభవన్లో కుక్క బతుకే బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

(Visited 157 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *