కనిపించొద్దంటే మళ్ళీ ఎందుకొచ్చావ్.. కవితపై కేసీఆర్ ఫైర్.. :జ్ఞాపకం

Spread the love

జర్నలిస్ట్ డైరీ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ వెల్జాల చంద్రశేఖర్ గారు రాసిన అనుభవం నాకు బాగా నచ్చింది… ఈ మేటర్ చదివిన తరువాత “గుర్తుకొస్తున్నాయి..” పేరుతో జర్నలిస్టుల అనుభవాలు రాస్తే బాగుంది…

– యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్

కనిపించోద్దు అంటే మళ్ళీ ఎందుకొచ్చావు !
నిమ్స్ కు వచ్చిన కవిత పై కేసీఆర్ మండిపాటు
కన్న పిల్లలు కళ్ళ ముందు కనిపిస్తే మనస్సు మారవచ్చునీ ఆవేదన
నిమ్స్ లో దీక్ష సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన ఏకైక ఇంటర్వ్యూ లో
వెల్లడించిన సంచలన విషయాలు

డిసెంబర్ 4, 2009
తెల్లారేసరికి ఒక్క సారిగా తెలంగాణ అంతటా ఉద్విగ్న, గంభీర, ఉద్రిక్త వాతావరణం.
ఆ ముందు రోజు ఉదయమే ఖమ్మం జైల్ నుంచి కేసీఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు తరలించడం, అదే రోజు రాత్రి కేసీఆర్ అరెస్ట్ తో చలించి ఆత్మబలి దానానికి యత్నించిన శ్రీకాంతాచారి తుది శ్వాస విడ వడం ఒకే రోజు జరిగింది.

కేసీఆర్ ను హైదరాబాద్ తరలించడంతో తెలంగాణ వాదులంతా హైదరాబాద్ బాట పట్టారు . తరలి వచ్చిన వా రిలో కొందరు నిమ్స్ బయట నినాదాలు మరి కొందరు లోపలికి వెళ్లాడానికి విశ్వ ప్రయత్నo చేస్తున్నారు. నిమ్స్ లోకి ఎవ్వరూ ప్రవేశించకుండా బారికేడ్లు , సాయుధ పోలీసుల పహారా, గట్టి బందో బస్తూ ఏర్పాటు చేశారు. నిమ్స్ లోకి కేసీఆర్ కుటుంబీకులు. కొందరు టిఆర్ఎస్ ముఖ్యులు తప్పా ఇతరులను అనుమతిచడం లేదు. నిమ్స్ సిబ్బంది మాత్రం వెనుక గేట్ నుంచి అనుమతి కల్పించారు.


ఒక వైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం , మరో వైపు శ్రీకాంతాచారి మరణం తుఫాను ముందటి వాతావరాన్ని తలపిస్తుంది . పరిస్థితి చేయి దాటాక ముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణ మంత్రులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ధీక్ష విరమించాలని కోరడానికి ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేంద్రను నిమ్స్ కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కవరేజ్ కోసం నిమ్స్ బయటే పడి గాపులు కాస్తున్న మీడియాకు సమాచారం అందింది. అదే విషయం కొద్ది సేపటికి టీవి చానల్స్ లో స్క్రోలింగ్ లు కూడా ప్రారంభం అయ్యాయి. మంత్రి దానం నిమ్స్ లోకి వెళ్ళే దృశా న్ని చిత్రీకరించడానికి ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలను సిద్దం చేసుకునే పనిలో పడ్డాయి. ఇంతలోనే దానం వెనుక గెట్ నుంచి నిమ్స్ లోపలికి వెళ్ళి నట్టు మీడియాకు సమాచారం పొక్కింది. కనీసం బయటికి వచ్చే విజువలస్ అయినా మిస్ చేయకూడదన్న కంగారూ లో వారున్నారు. అప్పటికే హాస్పిటల అవరణ లో అటూ ఇటూ తిరగుతున్న కేసీఆర్ కూతురు కవిత కూడా మంత్రి లోపలికి వెళ్లారన్న సమాచారంతో హాస్పిటల్ లో పలికి హడావిడిగా వెళ్తుంది. అక్కడున్న మీడియా కాన్సట్రేషన్ మంత్రి పైనే ఉంది. కవిత హడావిడిగా వెళ్ళతుండటం అక్కడే ఉన్న పలకరింపుగా నేను అనుసరించాను.

అంతకు ముందే రెండు మూడు సార్లు నేను వారి ఇంటికి వెళ్ళడం, ఫోన్ లో కూడా మాట్లాడటం, పైగా టిఆర్ఎస్ బీట్ రిపోర్టర్ గా నేను ఆమెకు సుపరిచితుడినే. నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్ననిస్తూ నేను అనుసరించాను . ఆమెతో నేను మాట్లాడుకుంటూ రావడంతో గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ కూడా అపలేదు . నేను ప్రెస్ వాడినన్న అనుమానం వారికి కలుగ లేదు. ఆమె వెంటే రెండో అంతస్తులో కేసీఆర్ చికిత్స పొందుతున్న రూమ్ నెంబర్ 228 లోకి అడుగు పెట్టాము. అప్పటికే మంత్రి దానం నాగేందర్ మంచం పక్కన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ల ప్రసాదరావు , మరి కొందరు డాక్టర్లతో మాట్లాడుతున్నారు. ఆ విఐపి రూమ్ లో మరో గది కూడా ఉంది. ఆ గది వద్దనే నిల్చొని అక్కడ జరుగు తున్న విషయాలను గమనిస్తున్నాను.

మంత్రి వారితో మాట్లాడటం ముగిశాక “విన్నారా.. అన్నా ధీక్ష విరమించక పోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు అంటున్నారు . నా మాట వినండి, ఒక మంత్రిగా కాదు ఒక తమ్మునిగా అడుగుతున్నా …ధీక్ష విరమించండి. మీరు, మేము అందరం కలిసి రాష్ట్రాన్ని తెచ్చుకుందాం . సిఎం గారు నా చేతిలో ఏమి లేదని, అలాంటప్పుడు ఎలా హామీ ఇస్తానని అంటున్నారు. మీ వల్లనే మాకు ఇంతో అంతో గౌరవం. మీ వల్లనే మాకు గుర్తింపు. లేకపోతే మమ్మల్ని ఎవ్వరు దేకరు. నా మాట ఈ ఒక్క సారి వినండి“ అంటూ మంత్రి దానం రెండు చేతులు జోడించారు . మంచం పై పడుకున్న చోట నుంచే లేవలేని స్థితి లో ఉన్న కేసీఆర్ రెండు చేతులు జోడిస్తూ “ఆయన పరిధి లో ఉన్నదే చేయమనండి. అసెంబ్లీ లో తీర్మానం చేయడానికి ఇబ్బంది ఏమీలేదుగా “ అని నిసత్తువతో బలహీనమైన స్వరం తో ప్రశ్నించారు. “ మీరు మరో సారి ఆలోచించండి. డాక్టర్లు ప్రమాద మంటున్నారు“. అని దానం అన్నారు. చేతులకు సెలేన్ బాటిల్ పైప్ లు ఉండటం తో ఛాతీ పైనే చేతులు జోడించి తల అడ్డంగా తిప్పారు. మంత్రి దానం అక్కడే నిలబడ్డ కవిత వైపు చూస్తూ మీరైన సముదాయించండి అంటూ వెళ్ళి పోయారు. ఆయన వెళ్ళగానే అప్పటి వరకు దూరంగా చూస్తూ నిలబడిన నాతో పాటు అప్పటికే అక్కడున్న జర్నలిస్ట్ నాయకుడు విరహత్ అలీ కేసీఆర్ మంచం సమీపానికి వెళ్ళి నమస్కరించాo . ఎలా ఉంది సార్ అని ప్రశ్నిస్తే తల ఉపారు తప్ప సమాధానం చెప్పలేదు. ఆయన దృష్టి దూరంగా నిలుచున్న కూతురు వైపు కోపంగా చూస్తూ ఎందుకు వచ్చావన్నట్టు కను సైగతోనే ప్రశ్నించారు . దీంతో కవిత వెంటనే ఆ పక్క నే ఉన్న గదిలోకి సర్రున వెళ్ళి పోయింది.

ఆమె లోపలికి వెళ్ళగానే కేసీఆర్ మా వైపు చూస్తూ “పిల్లలు కళ్ళ ముందు కనిపిస్తే చావడానికి సిద్ధమైన నా మనస్సు లోకి మరో ఆలోచన రా కూడదని హాస్పిటల్ కు ఎవ్వరిని రావద్దని చెప్పినా చిటికి మాటికి వస్తుందని తన కోపానికి గల కారణాన్ని వివరిస్తుండగా క ల్ల లో తిరిగిన నీళ్లు ఆపుకోలేక పోయారు. సిఎం రోశయ్య తన చేతిలో ఏమి లేదని అంటున్నా రు కదా! అని గుర్తు చేయగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే వ్యతిరేకిoచ్చే వారు ఎవ్వరున్నారని ప్రశ్నించారు. టిడిపి కూడా మద్దతు ఇస్తామన్నాక అభ్యంతరం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. వ్యతిరేకిస్తే , గిస్తే ఆ ఒక్క సిపిఎం ఒకటే కదా అని అన్నారు.మొదట ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తే, అక్కడ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుంది అన్నారు.

◦ నేను బతికి ఉండగా తెలంగాణ ఇవ్వకపోతే చనిపోయిన తర్వాత అయిన ఇవ్వక తప్పదు కదా అని ప్రశ్నించారు. నాకు చావు అంటే భయం లేదు, అన్నిటికీ సిద్దపడే చివరికీ ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారు. నేను చనిపోయినా ఒక లక్ష్యం కోసం , నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం చని పోయానన్న తృప్తి అయినా మిగులుతుందన్నారు. ఇంతలోనే డాక్టర్లు వచ్చి ప్లీజ్ మాట్లా డించవద్దని వారించారు. ఇక కేసీఆర్ మా వైపు చూస్తూ వెళ్ళమని నమస్కారం చేశారు. నేను కూడా నమస్కారం చేసి అక్కడ పక్క గదిలో ఉన్న కవిత ను పలకరించి బయటికి వచ్చేశా. నేరుగా ఆఫీసు కెళ్లి నిమ్స్ లో కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసిన విషయాన్ని ఎడిటర్ గారికి చెప్పాను. ఇన్ఫెక్షన్ వస్తుందని ఎవ్వరిని లోపలికి అనుమతిచడం లేదని, ఇంత వరకు ఎవ్వరికీ ఇంటర్వ్యూ ఎవ్వలేదని మనకే ఎక్స్ క్లూ అవుతుందని చెప్పడంతో మరుసటి రోజు ఫ్రంట్ పేజీలో ప్రముఖంగా ప్రచురితం అయింది.
**
ఇలా ఉండగా ఈ ఇంటర్వ్యూను కాంగ్రెస్ పార్టీ వివాదాస్పదం చేసింది. ఇంటర్వ్యూ లో చెప్పిన అంశాలను బిట్వీన్ లైన్స్ లో చదవ కుండా ‘ అసెంబ్లీ లో తీర్మానం చేసినా దీక్ష విరమిస్తాన’ని కేసిఅర్ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారని కాంగ్రెస్ నాయకుడు గోనె ప్రకాష్ రావు టీవీ డిబెట్లలో వక్రీకరించారు. ఒకవైపు నిమ్స్ లో తమ నాయకుడు కేసీఆర్ చావు బతుకుల మధ్య ఉండటంతో ఇంటర్వ్యూలో అలా ఎక్కడా చెప్పారని, అడిగే వారు కానీ ఖండించే వారు కానీ లేని పరిస్థితి . ఆ ఇంటర్వ్యూ చదవని వారు నిజమేనేమో అన్నంతగా కాంగ్రెస్ నేతలు రాద్దాంతం చేశారు. ఈ ఇంటర్వ్యూ లో కేసీఆర్ ఎంతటి చిత్తశుద్దితో దీక్ష చేశారో కళ్ళ కు కట్టినట్టు వివరించినా ఆ పార్టీ నాయకులు దీనిని ఎక్కడా కనీసం ఆ పార్టీ నేతలు సాక్ష్యంగా చూపించుకొలే లేని దుస్థితి.. బహుశా ఆ పార్టీ నేతలు కేసిఆర్ దీక్ష పై నే దృష్టి సారించడం వల్ల చూసి ఉండక పో వచ్చు.


మీడియాకు: కొన్ని ప్రత్యేక సందర్భంలో చేసే ఇంటర్వ్యూలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంటర్వ్యూకు వెళ్తున్నట్టు పెన్ను, బుక్ , భుజానికి సంచి తో హంగామా చేయకుండా సైలెంట్ గా పలకరించి ఇంటర్వ్యూ గా మల్చుకోవడం కూడా జర్నలిజం వృత్తిలో ఒక కళే.

(Visited 248 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *