Reveiw : మరో దృశ్యం… కార్తీ ‘దొంగ’

Donga Movie Karthi
Spread the love

కార్తీ మరోసారి స్పెషాలిటీ చూపించాడు. ఖాకీ, ఖైదీ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో వచ్చిన కార్తీ.. తనదైన ప్రత్యేకతను చూపిస్తూ… ‘దొంగ’గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.

ఖైదీ, దొంగ ఈ రెండు చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాల పేర్లే అయినా.. వాటికి తలవంపులు తెచ్చేలా మాత్రం లేవు. ఇవి కార్తీ మార్క్ ఖైదీ, కార్తీ మార్క్ #Dongaగా ముద్రపడిపోయినట్టే.

బాలకృష్ణ లాంటి భారీ ఇమేజ్ ఉన్న మాస్ హీరోకు కథలు రాయడంలో ఫెయిల్ అవుతున్న రైటర్స్… కార్తీ విషయంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. తనకు సూటయ్యే కథలు ఓకే చేయడంలో కార్తీ సక్సెస్ అవుతున్నాడని చెప్పాలి. (బాలయ్య తెలుగు, కార్తీ తమిళ్ అయినప్పటికీ… ఇక్కడ ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు వచ్చాయి కాబట్టి కంపేర్ చేయాల్సి వచ్చింది.)

కార్తీ సినిమాల్లో కథతో పాటు.. కథనం .. అందులో కార్తీ యాక్షన్ కట్టిపడేసేలా ఉంటాయి. కార్తీ కోసమే సినిమాలకు వచ్చే ఆడియన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. సాటిస్ ఫై అయి.. థియేటర్ నుంచి బయటకొస్తారు. దొంగ కూడా అంతే.. క్లైమాక్స్ ట్విస్ట్ ఒక రేంజ్ లో ఉంది మరి.

దొంగ మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్. మలయాళంలో ఆయన మోహన్ లాల్ , మీనాలతో తీసిన దృశ్యం .. సౌత్ లోనే కాదు.. హిందీలోనూ బ్లాక్ బస్టర్ కాన్సెప్ట్. మరోసారి బిగి సడలని స్క్రీన్ ప్లేతో… క్లైమాక్స్ ట్విస్టుతో ప్రేక్షకులను దిమ్మ తిరిగేలా చేశాడు జీతో జోసెఫ్. ఓసినిమాతో తాను చేసిన మ్యాజిక్ ను.. మరో కోణంలో.. మరోసారి రిపీట్ చేయడం అంత ఈజీ కాదు. అందుకు తగ్గ కథ… కథనం.. పెర్ఫామెన్స్.. ఉండాలి. దర్శకుడి ప్రతిభ, నటీనటుల టాలెంట్ అన్నీ కుదిరాయి కాబట్టే..దొంగ మూవీ థమ్సప్ అనిపిస్తోంది.

ఫస్టాఫ్ లో కార్తీ మార్క్ కామెడీతో సరదా గా సాగిపోతుంది. సెకండాఫ్ అంతా అసలైన సస్పెన్స్ డ్రామానడుస్తుంది. క్లైమాక్స్ అయితే పీక్స్. మూవీ చూసి ఆ ఫీల్ పొందాల్సిందే.

హీరో కార్తీ… ప్రధాన పాత్రధారి జ్యోతిక… కార్తీ-కట్టప్ప(సత్యరాజ్).. మధ్య సీన్స్ గ్రిప్పింగ్ గా ఉన్నాయి. అవే మూవీకి బలం. కామెడీని కూడా ప్రత్యేకంగా డీల్ చేశాడు డైరెక్టర్.

రెగ్యులర్ ఎంటర్ టైనర్ లు కాకుండా..సినిమాతో డిఫరెంట్ వినోదం.. ఎంటర్ టైనింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి దొంగ బాగా నచ్చుతుంది. గో అహెడ్.

Read Also : వీళ్లిద్దరినీ బొక్కలో వెయ్యాలి.. జనం ఎమోషన్స్ తో ఆడుకుంటారా..?

(Visited 147 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *