వీళ్లిద్దరినీ బొక్కలో వెయ్యాలి.. జనం ఎమోషన్స్ తో ఆడుకుంటారా..?

Young Couple Banjarahills police
Spread the love

హలో యంగ్ కపుల్ ప్రవిజ, సురేష్…

మీ ఇద్దరు చేసిన పని ఎంతకు దారితీసిందో మీకు అర్థమైతుందా అసలు. చట్టాలను, కోర్టులను కాదని… ఓ ఆడపిల్లకు న్యాయం చేసిన పోలీసులను దేవుళ్లుగా కొలుస్తున్న టైమ్ లో.. అదే ఖాకీలపై మీరు దారుణమైన అలిగేషన్స్ చేశారు. సాహో పోలీస్.. మీరే మా అండ.. మీరే మా ఆశ.. అంటూ నీరాజనాలు పలుకుతున్న టైమ్ లో మీరు వాళ్ల క్యారెక్టర్ నే అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేశంతో రగిలిపోతున్న సొసైటీ భావావేశాలతో మీరు ఆడుకున్నారని మీకు అర్థమవుతుందా అసలు. నడి నగరంలో బంజారాహిల్స్ స్టేషన్ లో ఇలా ఎలా పోలీసులు బిహేవ్ చేశారని.. జనం అందరూ పరేషాన్ అయ్యారు. ఓ ఆడపిల్లగా చెప్పకూడనిదంతా చెప్పి.. రాద్ధాంతం అయ్యాక… ఇపుడు మాకు మెంటలెక్కింది.. పోలీసులపై ఆరోపించిందంతా అబద్ధం అని చేతులు దులుపుకుంటే… ఏంటి అర్థం.

మీలాంటి మెంటలోళ్ల కారణంగా.. అనవసరంగా లక్షలు, కోట్లమంది మీమీద చూపిన అమూల్యమైన ‘సింపతీ’ వేస్టయింది. ఈ సింపతీ విలువ ఎంతో తెలుసా..! మమ్మల్ని చెరబట్టారు అని ఏ ఆడపిల్ల చెప్పినా.. పాపం అనడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించారు. ఇంకోసారి ఎవరైనా ఆడపిల్ల… పోలీసులపైనో.. ఇంకెవడిపైనో అలిగేషన్స్ చేస్తే.. వెంటనే నమ్మకుండా ఓసారి ఆలోచిద్దాం అని అనుకునేలా చేశారు మీరిద్దరు. థూ.. ఛీ.. ఇంతకంటే మిమ్మల్ని అనడం వేస్ట్ అని ప్రతి సామాన్యుడూ అనుకుంటున్నాడు.

దిశ సంఘటన.. నిర్భయ.. సమత లాంటి సంఘటనల మధ్య… ఓ యువజంట బంజారాహిల్స్ పోలీసులపై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు… సోషల్ మీడియాలో వీరిద్దరు ఫేస్ బుక్ వీడియోలో చేసిన ఆరోపణలు ప్రసారం అయ్యాయి. పబ్లిష్ అయ్యాయి.

Read Also : రేప్ చేయబోయారు..! బంజారాహిల్స్ పోలీసులపై యువజంట సంచలన ఆరోపణలు

ఐతే.. లేటెస్ట్ గా వీళ్లిద్దరు రిలీజ్ చేసిన మరో వీడియో చూసి.. వారి తరఫున మాట్లాడిన.. వాళ్లను పాపం అన్నవాళ్లంతా రివర్స్ అవుతున్నారు. ఆడపిల్ల అయ్యోపాపం.. అంత ఇబ్బంది పెట్టారా.. అని బాధపడ్డవాళ్లంతా… ఇపుడు తిరిగి రివర్స్ లో తిడుతున్న పరిస్థితి ఏర్పడింది.

ఫేస్ బుక్ వీడియోలో ప్రవిజ, సురేష్ దంపతులు… తమపై చేసిన ఆరోపణలను బంజారాహిల్స్ పోలీసులు ఖండిస్తూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆధారాలు బయటపెట్టాలంటూనే…. పరువు నష్టానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాల తర్వాత వీళ్లు లేటెస్ట్ గా ఓ వీడియో పెట్టారు. మాకు మెంటలెక్కిందనీ… వీడియోలు డిలీట్ చేశామని .. చేసిన ఆరోపణలు తప్పని అన్నారు.

మొన్నటికి మొన్న“నాపై పోలీసులు రేప్ చేయబోయారు” అని బాధతో చెప్పిన ఆమే… నమస్కారమండీ.. మేం ఇంతకుముందు పెట్టిన వీడియో డిలీట్ చేశాం.. మేం చేసింది ఫాల్స్ అలిగేషన్స్ అని… మా ఫ్రెండ్స్, బంధువులు మమ్మల్నే తిట్టారు. నిజంగా మేం చేసింది ఫాల్స్ అలిగేషన్సే అండీ.. మమ్మల్ని క్షమించండి.. ప్రూఫ్స్ అని చెప్పాం. కానీ.. మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు.. డ్రెస్సులు మార్చాల్సి వచ్చిందన్నాం.. కానీ అలాంటిదేమీ లేదు. మీడియాను, ప్రెస్ ను, సొసైటీని లాగినందుకు మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయం. సారీ” అని ఆ అమ్మాయి చెప్పింది.

మొన్నటి వీడియోలో పోలీసులను విమర్శిస్తూ వీర లెవెల్లో డైలాగులు దొబ్బిన సురేష్… “మేం తొందరపడి అనాలోచితంగా ఆ వీడియోలు పెట్టాం. మతిస్థిమితం కోల్పోయిన పరిస్థితుల్లో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అది. మా తప్పు తెల్సుకున్నాం. క్షమించండి” అని సన్నాయి నొక్కులు నొక్కాడు.

విజయవాడకు చెందిన  ఈ ఇద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కరి విమర్శను అర్థం చేసుకోవాల్సిందే. అప్పుడే ఇంకెవరూ ఇలాంటి పిచ్చిపిచ్చినాటకాలు దొబ్బరు. –కేకన్యూస్.కామ్.

Read Also : ఆరోపించిన జంటపై కేసు పెడతాం.. బంజారాహిల్స్ పోలీసుల కౌంటర్

(Visited 138 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *