కల్నల్ కుటుంబానికి సాయం సరే.. మరి లేటుగా ఎందుకు స్పందించినట్టు..?

cm kcr colonel Santhosh
Spread the love

కేసీఆర్ ముందే ఎందుకు ప్రకటించలేదు.. కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరగకముందో.. జరిగిన తర్వాతో.. లేదా ఆయన ప్రాణత్యాగం చేసిన రోజే ప్రకటించొచ్చు కదా.. ఇంతలేట్ గా ఎందుకు ప్రకటించారు.. ప్రధాని మోడీ మీటింగ్ లో ఆయనకు జ్ఞానోదయం అయిందా.. ప్రధాని మోడీ ఆల్ పార్టీమీటింగ్ కు అటెండైతే తప్ప.. కేసీఆర్ కు సీరియస్ నెస్ తెలియలేదా.. బోర్డర్ లో జరిగిన సంఘటనను అప్పటివరకు సీఎం కేసీఆర్ పట్టించుకోలేదా.. అందుకే ఆయన పెద్దగా స్పందించలేదా.. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి.

ఐతే… ఏ సాయం చేసినా.. స్పందించినా… అది దేశం ఉలిక్కిపడేలా… ఉండాలని కేసీఆర్ భావించినట్టు సమాచారం. అందుకే.. ఆలస్యంగా అయినా… ప్రధాని ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది కాబట్టి.. ఆ సమావేశంలోనే మోడీ సహా అందరు సీఎంల ముందు ప్రకటించాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. ఇపుడు కేసీఆర్ ప్రకటన.. దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో చర్చకు వచ్చినట్టయిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం తెలిపారు.

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించారు.

వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది.

సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బుందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలి’’ అని సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా చెప్పారు

(Visited 95 times, 1 visits today)
Author: kekanews