Prabhas Fauji : బాహుబలి వరకు చాలా అందంగా, ఆజానుబాహుడిగా కనిపించిన ప్రభాస్.. సాహూ సినిమాకు కాస్త చేంజ్ అయ్యాడు. ఇక రాధే శ్యామ్ సినిమా వచ్చే సరికి మొహం చాలా ఉబ్బిపోయి కనిపించాడు. దాంతో.. ఆడియన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ సమయంలో ప్రభాస్ లుక్ పై చాలా విమర్శలు వచ్చాయి.
Jr NTR’s Devara Part 1 : ‘దేవర’ హిందీ ప్రమోషన్ మామూలుగా లేదుగా!
కొంతమంది ప్రభాస్ బాలీవుడ్ కి వెళ్ళినకారణంగానే అలా అయిపోయాడు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేశాడు. ఆ తరువాత వచ్చిన ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాల్లో కూడా ఇంచుమించు అలానే కనిపించాడు. కానీ, ప్రస్తుతం ప్రభాస్ కనిపించిన లుక్ కి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఆయన మత్తువదలరా 2 సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ప్రభాస్ చాలా స్లిమ్ గా కనిపించాడు. బాహుబలికి ముందు కనిపించిన ప్రభాస్ లా చాలా సన్నగా కనిపించి ఆడియన్స్ కి షాకిచ్చాడు.
అయితే.. ఈ లుక్ హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ కోసం అని తెలుస్తోంది. ఆర్మీ బ్యాక్డ్రాప్ పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యింది. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో హీరో లుక్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదట హను. అందుకే.. ఆ పాత్ర కోసం ప్రభాస్ ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్నాడట. స్పెషల్ డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నాడట. ఆ కారణంగానే స్లిమ్ గా తయారయ్యాడట ప్రభాస్. దాంతో.. ప్రభాస్ కొత్తగా కనిపిస్తున్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. మా ప్రభాస్ మారిపోయాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్