ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీకపూర్ చేసిన సందడి ఇంతా అంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే దుమ్ములేపుతోంది.
Tamannah : అందాలు బట్టబయలు.. తమన్నా తడాఖా ఇదీ
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. ఈసారి హిందీ ప్రమోషన్స్ లోనూ తారక్ కొరటాల అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందీ ప్రమోషన్స్లో దర్శక నిర్మాత కరణ్ జోహర్ సహా సందీప్ రెడ్డి వంగా కూడా సాయపడుతున్నారు. అలాగే ట్రిపుల్ ఆరో ఎన్టీఆర్ కోస్టార్ అలియాభట్ కూడా దేవరను ప్రమోట్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఈ సినిమాలో నటించిన స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ప్రచారం కూడా అక్కడ అదనపు బూస్ట్ ఇవ్వనుంది. ప్రస్తుతం సందీప్ వంగా ముంబైలో ఉన్నారు.
అక్కడ తారక్ బృందానికి ప్రమోషన్స్ పరంగా సాయపడనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వార్ 2లో ఎన్టీఆర్ కొలీగ్ అయిన హృతిక్ రోషన్ కూడా దేవర 1కి ప్రచార సాయం చేస్తారని అంతా భావిస్తున్నారు. తారక్ నోరు విప్పి అడిగితే హృతిక్ కాదని అనడు. ఒకవేళ గ్రీక్ గాడ్ ప్రచారం చేస్తే అది హిందీ బెల్ట్స్ వసూళ్లకు అదనపు బూస్ట్ల్న ఇస్తుందని భావిస్తున్నారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దేవర హిందీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ ముంబైకి వెళ్లాడు. తారక్ అతడి సహనటులు సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్లతో కలిసి కపిల్ శర్మ ‘ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ’ షోలో ప్రత్యేక ప్రచార ఎపిసోడ్లో పాల్గొన్నారు.
HYDRA WhatsApp : కబ్జా కనిపిస్తే వాట్సప్ చేయండి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన
ఎన్టీఆర్ క్యాజువల్ గా కనిపించగా, సైఫ్ ఫార్మల్ వేర్లలో డాషింగ్గా కనిపించారు. జాన్వీ బ్లూ కలర్ డ్రైన్లో కనువిందు చేస్తోంది. సెట్లో ఉన్న ఎన్టీఆర్, సైఫ్, జాన్వీల కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.