మార్చి, ఏప్రిల్, మే నెల కిరాయి అడిగితే కేసు పెడతాం: కేసీఆర్

cm kcr on hyderabad rents
Spread the love

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి బాగా ఉందని.. నియంత్రణ కష్టమవుతుండటంతో.. కేంద్రం సూచించిన రిలాక్సేషన్ ను ఏప్రిల్ 20నుంచి అమలుచేయడం లేదని CM KCR చెప్పారు. రాష్ట్ర కేబినెట్ మీటింగ్ తర్వాత.. మీడియాతో క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడారు. ఇళ్ల కిరాయి దారులకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో.. కిరాయిని విధించొద్దని ఓనర్లక సీఎం సూచించారు. ఇది రిక్వెస్ట్ కాదనీ… చట్టపరమైన హెచ్చరికగా చెబుతున్నామన్నారు. ఈ మూడు నెలల కిరాయిని వసూలు చేస్తే.. ఫిర్యాదులు వస్తే.. వారిపై కఠిన చర్యలుంటాయన్నారు సీఎం.

ఈ మూడు నెలల కిరాయిని తర్వాత నెలల్లో చెల్లించుకోవచ్చని సూచించారు KCR. ఎవరైనా ఒత్తిడి చేస్తే.. డయల్ 100కు ఫోన్ చేయాలని… ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెప్పారు.

ప్రైవేటు స్కూళ్లలో వచ్చే ఏడాదికి ఒక్క రూపాయి కూడా ఫీజులు పెంచొద్దని సీఎం సూచించారు. ట్యూషన్ ఫీజులను నెలవారీగా తీసుకోవాలని అన్నారు. 2019-20 ప్రాపర్టీ టాక్స్ ను ఫైన్ లేకుండా కట్టొచ్చని చెప్పారు. ఏప్రిల్ లో ఇచ్చినట్టుగానే… మే నెల లోనూ ఉచితంగా ప్రతీ వ్యక్తికి 12 కిలోల బియ్యం ఇస్తామనీ.. కుటుంబానికి రూ.1,500/- కూడా చెల్లిస్తామన్నారు. అకౌంట్లలో డబ్బులు పడ్డాక వెనక్కి పోవనీ.. మెల్లగా తీసుకోవచ్చని చెప్పారు. వలస కూలీలకు 500/-, 12 కిలోల బియ్యం, వారు కుటుంబంగా ఉంటే 1,500/- ఇస్తామన్నారు సీఎం. లాక్ డౌన్ టైమ్ లో.. పరిశ్రమలకు విద్యుత్ ఫిక్స్ డ్ చార్జీలు వసూలు చేయం అనీ.. ఇన్ టైమ్ లో పే చేస్తే.. 1 పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామన్నారు సీఎం.

(Visited 118 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *