మూత్రానికి వెళ్లకుండా డైపర్లు వాడుతున్నాం.. ఐసీయూలో డాక్టర్ల కష్టాలు

Corona Virus Doctors Dedication
Spread the love

కరోనా వైరస్ వ్యాధిని నయం చేయడానికి డాక్టర్లు తమ ప్రాణాలను అడ్డుపెడుతున్నారు. మనదగ్గరేకాదు..దేశంలో… ప్రపంచంలో అంతటా.. డాక్టరే ఇప్పుడు దేవుడు. కరోనా రాకుండా.. సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్ లాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. మరి వైరస్ సోకిన పేషెంట్ తో డాక్టర్లు ఎలా ఉంటారు.. పేషెంట్ కు చికిత్స ఎలా చేస్తారు… అనే దానిపై.. డాక్టర్ సాయి నాథ్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఓసారి అది చూస్తే.. కొవిడ్ 19కు చికిత్స అందిస్తున్నడాక్టర్లకు దండం పెట్టకుండా ఉండలేం. ఆయనేమన్నారో.. ఆయన మాటల్లోనే.

నేను డాక్టర్ సాయినాథ్. ఎయిమ్స్, ట్రామా సెంటర్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్. నేను COVID ICU కి నియమించబడ్డాను. ఇలాంటి ఆరోగ్య విపత్తులు వస్తే ఎదుర్కోవడం ఎలా అనే దానిపై మొదటినుంచి ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాను. మేము ఆరు గంటల పాటు.. నాలుగు షిఫ్టులలో పని చేస్తాం. 24/7 సంరక్షణను అందిస్తాం. మేము ఏడు రోజులు వర్క్ చేస్తాం.. ఆ తర్వాత.. వరుసగా ఏడు రోజులపాటు రెస్ట్ తీసుకుంటుంటాం. ప్రస్తుతం, నేను నా రెస్టింగ్ టైమ్ పూర్తిచేసి.. సెకండ్ వర్క్ షిఫ్ట్ లో ఉన్నాను.

గత కొన్ని వారాలుగా, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ ను వాడుతున్నాం. కరోనా చికిత్సలో పాల్గొనడం పనిభారం ఎక్కువైనట్టుగానే అనిపిస్తోంది. పీపీఈ కిట్ వేసుకోవడానికి.. విప్పేయడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. పీపీఈ కిట్ ఒకసారి మాత్రమే వాడగలం. తర్వాత దాన్ని పడేయాల్సిందే. పీపీఈ కిట్ వేసుకుని.. చికిత్స అందిస్తున్నప్పుడు.. మేం మా జనరల్ అవసరాలైన ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి తీసుకోవడం మర్చిపోతాం. ఆరు గంటల షిఫ్ట్ టైమ్ లో కనీసం మేం బాత్రూమ్ కూడా వెళ్లం. అత్యవసర సమయాల్లో పెద్దలు ఉపయోగించే డైపర్లను వాడుతాం.

మాకు ఇచ్చిన కిట్ పూర్తిగా కప్పిఉండటం వల్ల కనీసం.. లోపలికి అప్పుడప్పుడు గాలి ఆడక శ్వాస ఇబ్బంది వస్తుంది. కొన్ని నిమిషాల పాటు ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. లోపల చాలా వేడిగా.. ఉక్కపోతగా అనిపిస్తుంటుంది. కొన్ని సార్లు కళ్లకు పెట్టుకున్న అద్దాలకు నీటి ఆవిరిలాగా పొర అలుముకోవడంతో.. అంతా మసకమసకగా అయిపోతుంది. పీపీఈ కిట్ లో అందరూ ఒకేలాగా కనిపిస్తుంటాం కాబట్టి.. మేం మా డ్రెస్ ఛాతి భాగంపై పేర్లు రాసుకుంటాం.

ఐసీయూ, కరోనా వార్డుల్లో మా మధ్య కమ్యూనికేషన్ ఓ సవాల్ లాంటిది. ఏ డాక్టరైనా అరిస్తే.. చిన్నగా వినిపిస్తుంటుంది. ఎమర్జెన్సీ టైమ్ లో .. మేం మరింత జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే.. కమ్యూనికేషన్ గ్యాప్ అప్పుడప్పుడు చాలా టెన్షన్ పరిస్థితులు తీసుకొస్తుంది. ఇందుకోసం.. మేం ఓ చెక్ లిస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాం. సైగలతో మాట్లాడుకుంటుంటాం.

డ్యూటీలో ఉన్నప్పుడు కొద్దిసేపు బయటకు వెళ్లొద్దామా అనిపిస్తుంది. ఐదు నిమిషాలు గాలి పీల్చి వద్దామా అనిపిస్తుంది. కానీ.. అలా పీల్చేందుకు మరో రోజు ఉందిలే అని మనసులో సర్దిచెప్పుకుంటుంటాం.

కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా కంట్రోల్ అయ్యాక.. నేను కోల్కతా వెళ్తా. అక్కడ మా అమ్మానాన్నలను కలుస్తా. నేను కొవిడ్ వార్డ్ లో డ్యూటీ చేస్తున్నప్పటినుంచి వాళ్లు ఎంతో టెన్షన్ పడుతున్నారు. కానీ రానున్న కొద్ది నెలల పాటు… అది అంత ఈజీ కాదని.. మాకు అర్థమవుతోంది.

ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఉద్దేశంతో ప్రతిజ్ఞ చేసి మరీ డాక్టర్ వృత్తిలోకి వచ్చాం. అలాంటి మాపై దాడులు చేస్తున్నారని తెలిసినప్పుడు.. బాధనిపిస్తుంది. ఈ వృత్తిలోకి ఎందుకొచ్చానా అనిపిస్తుంటుంది. కానీ.. మీ ప్రాణాలు మాపై ఆధారపడి ఉన్నాయని తెలిసి.. మా ప్రతిజ్ఞ గుర్తొచ్చినప్పుడు ఆగిపోతుంటాం.

బాధలు, త్యాగాలు, క్లిష్టపరిస్థితుల్లో డ్యూటీ చేయాల్సివచ్చినప్పటికీ…. రిస్క్ చేయడానికే డాక్టర్లు తమ జీవితాలను  అంకితం చేస్తారు. కీలకమైన కరోనా వ్యాధి సమయంలో.. డాక్టర్ల సేవలను గుర్తించి.. వారికి అండగా నిలవండి. కనీసం సానుభూతి చూపండి. కానీ కొట్టొద్దు. ఈ పోస్ట్ కొద్దిమందిలో అయినా మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నా.

(Visited 194 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *