బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao)పై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, వారి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రఘునందన్ రావు తెలిపారు.
కేటీఆర్, హరీశ్ రావుతోపాటు పలు యూట్యూబ్ ఛానల్స్‌పై కూడా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే దుష్ప్రచారం చేస్తున్నారని, అభ్యంతరకరంగా ట్రోల్స్ చేస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని ఆయన హెచ్చరించారు. దుబ్బాక, సిద్దిపేట, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.