Anushka Ghaati : అందాల భామల ఆరాధకులకు కన్నుల విందుపెట్టేసింది బెంగళూరు బ్యూటీ అనుష్క షెట్టి. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఘాటీ సినిమాతో వెండితెర ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
అనుష్క షెట్టి ప్రధాన పాత్రలో నటించిన ప్యాన్ ఇండియా మూవీ ఘాటీ. దీనికి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ చేశారు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మించడంతో.. అభిమానులందరూ ‘వదిన’కు సూపర్ అంటూ అభినందనల ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఘాటీ ట్రైలర్ సూపర్ ఉంది. చూడగానే ఆకట్టుకుంటోంది. కొండ ప్రాంతాల్లో సరుకు తరలించే ఘాటీలను అన్యాయంగా డ్రగ్స్ అక్రమ రవాణా కోసం వేధించి వెంటాడి చంపుతుంటుంది ఓ ముఠా. దీంతో.. ఘాటీల్లో అనుష్క, విక్రమ్ ప్రభు దీనిని వ్యతిరేకిస్తారు. విలన్లతో వీరిద్దరూ చేసిన వీరోచిత బతుకు పోరాటమే సినిమా.
అనుష్క లుక్కు మాత్రం అద్దిరిపోయింది. పలు సీన్లలో గ్రాఫిక్స్ తో అనుష్కను కవర్ చేసినట్టు తెలిసిపోతుంది. అనుష్కను సన్నగా చూపించడానికి మేకర్స్ ట్రైలర్ లో చాలా కష్టపడినట్టు సమాచారం. ట్రైలర్ ను దగ్గరనుంచి గమనించిన అభిమానులకు అనుష్కలోని ఈ తేడా కచ్చితంగా కనిపిస్తుంది.