CM KCR Delhi : 2021 సెప్టెంబర్ 2.. టీఆర్ఎస్ పార్టీ హిస్టరీలో నిలిచిపోనుంది.
ఆరోజు… ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి బిల్డింగ్ నిర్మాణానికి తొలి అడుగు పడనుంది.
దక్షిణాది పార్టీలతో పోల్చితే.. ఢిల్లీలో రీజనల్ పార్టీకి భవనం కట్టుకునేందుకు పర్మిషన్లు దొరికిన మొట్టమొదటి పార్టీనే మన టీఆర్ఎస్సే. ఆ రకంగా… కేసీఆర్ పార్టీ.. హిస్టరీలో నిలిచిపోయే ఘనత సాధించబోతోంది.
ఇప్పటికే.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరిపోయారు. కేటీఆర్.. ఇతర మంత్రులు.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ స్థలం చదును చేసే పనులు పరిశీలించారు. రేపు కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు.