Posted inMain Stories / Trending / ఫ్రెష్ కేక / వీడియో

వావ్…! రూ.1300లకే Mi LCD టాబ్లెట్

పెన్ను, పేపర్ అవసరం లేకుండా చదువు నేర్చుకుంటున్న రోజులివి. టెక్నాలజీ రాకతో… నేర్చుకోవడం అంతా డిజిటల్ రూపంలో జరుగుతోంది. పలక – బలపం అనేది ఒకప్పటి రోజులు. ఇపుడు అంతా టాబ్లెట్, రైటింగ్ స్క్రీన్ లలోనే అక్షరాలు దిద్దుతున్నారు. అవసరమైన డ్రాయింగ్ వేస్తున్నారు. రాయాల్సిందంతా రాసేస్తున్నారు. ఇందుకోసమే.. Mi సంస్థ ఓ రైటింగ్ టాబ్లెట్ తీసుకొచ్చింది. ఈ LCD ధర కేవలం రూ.1300 కావడం విశేషం.

ఇది ఓ రైటింగ్ టాబ్లెట్. అంటే డిజిటల్ పలక అని చెప్పొచ్చు. 10 ఇంచెస్, 13.5 ఇంచెస్ డిస్ ప్లేలో లభిస్తుంది. చాలా తక్కువ ధరలో లభిస్తోంది. చిన్న బ్యాటరీ వేస్తే వన్నియర్ నడుస్తుంది. సెపరేట్ ప్లగ్ పెట్టి ఎలక్ట్రిసిటీ చార్జి చేయాల్సిన అవసరం ఉండదు. స్టైలస్ ఉంటుంది. దాంతో.. అవసరమైనది రాయొచ్చు. బొమ్మలు వేయొచ్చు. రబ్ చేయొచ్చు. డిజైనింగ్ చేసుకోవచ్చు. నోట్స్ రాసుకోవచ్చు. నోటిఫికేషన్ లా నోటీస్ బోర్డ్ లా వాడొచ్చు.  ఫుల్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న వీడియో చూడండి.

Rashmika Samantha Pushpa Item Song Regina
Rashmika Samantha Pushpa Item Song Regina