తమన్నా హాట్ గా.. నయన్ పద్ధతిగా.. ఎందుకు..?

Spread the love

సైరా మూవీ టైటిల్ సాంగ్ వీడియో విడుదలైంది. పాట చూస్తుంటే గూస్ బంప్స్ కంపల్సరీ. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గొప్పతనాన్ని వివరిస్తూ… తమన్నా , నయనతార ఆ పాటలో కనిపిస్తారు. సినిమాపై ఉన్న అంచనాలను ఈపాట మరింత పెంచేసింది.

పాటలో చూస్తే.. తమన్నాతో స్కిన్ షో చేయించారు. నయనతార పద్ధతిగా కనిపిస్తుంది. నిండైన చీరకట్టు, బొట్టుతో నయనతార ఉంటుంది. కానీ.. తమన్నా మాత్రం ఓ ఐటమ్ గాళ్ లాంటి కాస్ట్యూమ్స్ లో ఉంటుంది. ఐతే.. సినిమాకు తగ్గట్టుగానే ఈ పాత్ర చిత్రణ జరిగిందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.

సైరా నరసింహారెడ్డి సినిమాలో నయనతార.. కీలకమైన సిద్దమ్మ పాత్రలో నటిస్తోంది. ఆమె నరసింహారెడ్డి భార్య. తమన్నా.. లక్ష్మి అనే రాజనర్తకి పాత్ర చేస్తోంది. పాత్రల ఆహార్యానికి తగ్గట్టుగానే.. నరసింహారెడ్డి భార్యగా నయనతార పాత్ర హుందాగా చూపించారు. నర్తకిగా తమన్నా అలరించే పాత్ర కావడంతో .. ఆమెను హాట్ గా చూపించారు. రాజనర్తకి పాత్రకు కొన్ని వీరోచిత సన్నివేశాలు కూడా ఉంటాయని… అందుకే.. తెరపై కనిపించే సమయం తక్కువైనా…. నటనా పరంగా తమన్నాకే ఎక్కువ స్కోప్ ఉంటుందని మేకర్స్ చెబుతున్న మాట.

ఈ పాటను మీరూ ఓసారిచూసేయండి.

(Visited 177 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *