Vitamin B12 Deficiency: విటమిన్ బి12 (Vitamin B12) మానవ శరీరంలోనే తయారవుతుంటుంది. అయితే ప్రస్తుత కాలంలో మారిన జీవశైలి తిండి అలవాట్లతో చాలా మందిలో ఇది అవసరమైన మేరకు సక్రమంగా తయారు కావటం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దేశంలోని 60 శాతానికి మందికి పైగా ప్రజల్లో విటమిన్ బి12 లోపం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీని డెఫిషియన్సీ కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ విటమిన్ వివిధ శరీర రోజువారీ విధులకు కీలకం. విటమిన్ B12 లోపం వల్ల ముందుగా రక్తహీనత సమస్యలు ఎదురవుతుంటాయి. ఇది అలసట, బలహీనతకు దారితీస్తుంది. అలాగే రెండవ అతిపెద్ద సమస్య న్యూరాలజీకి సంబంధించిన సమస్యలే. వాస్తవానికి మానవ శరీరంలో నరాల ఆరోగ్యానికి B12 చాలా ముఖ్యమైనది. ఈ విటమిన్ లోపం తలెత్తినప్పుడు తిమ్మిరి, జలదరింపు, బ్యాలెన్స్ సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఏకాగ్రతతో ఇబ్బందులు సైతం ఎదురవుతాయి. విటమిన్ లోపం డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
విటమిన్ బి12 కారణంగా జీర్ణ సమస్యలు ఎదురవుతుంటాయి. లోపం విరేచనాలు, మలబద్ధకం కు కారణం అవుతుంటుంది. నాలుక వాపు, నోటిపూత, దృష్టి లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. విటమిన్ లోపించటంతో హోమోసిస్టీన్ స్థాయిలను పెంచడానికి దారితీయవచ్చు. ఇది గుండె జబ్బులకు ప్రమాద కారకంగా మారుతుంది. అయితే విటమిన్ బి12 ఎక్కువగా మాంసాహారం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి వాటి ద్వారా ఆహారం రూపంలో తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.
మామిడి టెంక లోపల ఉండే విత్తనం పొడి వెజిటేరియన్లకు బెస్ట్ విటమిన్ బీ 12 ఆహారంగా చెప్పుకోవచ్చు. మామిడి విత్తనం నుండి తీసిన రసంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. 100 ml మామిడి గింజల కెర్నల్ రసంలో 10 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉందని ఒక అధ్యయనం కనుగొంది.