గుడ్ ఐడియా.. ఫిజికల్ డిస్టెన్స్ తో కొవిడ్ బైక్ వచ్చేసింది

LockDown bike
Spread the love

అసలే ఇది లాక్ డౌన్ టైమ్. రూల్స్ మీద రూల్స్ పెడుతున్నారు పోలీసులు. బయటకెళ్దామంటే… పోలీసులు రూల్స్ కన్నా… కరోనా సోకుతుందనే భయమే ఎక్కువమందిలో కనపిస్తోంది. కార్లు లేనివాళ్లు.. బైక్ పై ఇద్దరు వెళ్తే మాత్రం బుక్కైనట్టే. కేసు పెట్టి.. బైక్ సీజ్ చేసి… కోర్టులో తేల్చుకుందామని పోలీసులు తెగేసి చెబుతున్నారు. కారణం ఒకటే. బైక్ పై సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి. కారులో అయితే. ఫర్వాలేదు.. ఇద్దరు , ముగ్గురు వరకు వెళ్లొచ్చు. మరి లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ.. బైక్ నడపాలంటే.. దాని బాడీని పెంచాలి.. అది సాధ్యమయ్యేపనేనా. అంటే… ఔను అంటున్నాడు త్రిపుర రాష్ట్రానికి చెందిన ఓ కుర్రాడు.

అగర్తల కు చెందిన పార్థ అనే యువకుడు… బ్యాటరీతో నడిచే.. పొడవాటి మోటర్ సైకిల్ ను తయారుచేశాడు. రైడర్, పీలియన్ రైడర్ కు మధ్య వన్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. దీంతో.. ఈ LockDown bike పై ఫిజికల్ డిస్టెన్స్ సాధ్యమవుతుందన్నమాట.

పార్థ అగర్తలలో ఓ బైక్ మెకానిక్. బైక్ ను పార్టులు పార్టులుగా విప్పి కుప్పపెడితే.. తిరిగి యథా రూపానికి తేగల సమర్ధుడు. గతంలోనూ చిన్నచిన్న బ్యాటరీతో నడిచే వెహికల్స్ లాంటివి తయారుచేశాడు. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ టైమ్ లో..  బ్యాటరీతో నడిచే సైకిల్ తయారుచేసి.. మరింత ఫేమయ్యాడు. బ్యాటరీతో  దీన్ని బైక్ అని కూడా అనొచ్చు.

లాక్ డౌన్ టైమ్ లో ఫ్యామిలీతో వెళ్లాలంటే ఇబ్బంది అవుతోందని.. అందుకే.. కొత్తగా ట్రై చేయాలని భావించినట్టు చెప్పాడు పార్థ.

 

(Visited 80 times, 1 visits today)
Author: kekanews