విభజన హామీలు సాధించుకుందాం.. TJF పిలుపు

TJF Hyderabad
Spread the love

హైదరాబాద్:
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని విపక్ష పార్టీల నేతలు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లయినా విభజన హామీలకు అతీగతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టి జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రం – విభజన హామీలు అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్రం- విభజన హామీల సాధనే లక్ష్యంగా టి జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ రౌండ్ టేబ్ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడారు. మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులే మరోసారి తెలంగాణ ప్రజల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ అంతర్గత వలస పాలనకు గురైందని, పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదన్నారు. టి జర్నలిస్టులతో కలిసి ఐక్యపోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. చనిపోయిన అమరవీరుల స్థూపాల దగ్గర దీపాలు అనే కార్యక్రమం తీసుకోవాలని సూచించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పువాటిల్లుతోందని, నేడు మరో ఉద్యమానికి అంకురార్పణ చేసిన ఘనత పాత్రికేయులదేన్నారు విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య. విభజన హామీలేకాదు.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా లక్ష్మణ్. బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ఏ హామీలతో టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను తుంగలో తొక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరేళ్లయినా పునర్విభజన చట్టంలోని హామీలు అమలు కాలేదని సీపీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. విద్యార్థుల బలిదానం ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. అధికార టిఆర్ఎస్, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. తెలంగాణలో పరిపాలన తీరు, నిర్ణయాలు రాష్ట్రం ఏర్పాటుకు ముందుకంటే దారుణంగా ఉన్నాయన్నారు టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ. విభజన హామీల అమలు కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ప్రణాళిక బద్ధంగా ఐక్య పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

విభజన చట్టం తయారవుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలిసేది కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం. విభజన చట్టంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న ఆయన, చట్ట ప్రకారం జరగాల్సిన పబ్లిక్ రంగ సంస్థల విభజన ఇప్పటికీ నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన క్రిష్ణా నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అభివద్ది కోసం ప్రకటించిన రాయితీలు నేటి కూడా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశఆరు. ఆర్టికల్ 93, 94 ఆర్టికల్ ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేన్నారు. ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో లెక్కలకు రాష్ట్ర అప్పులకు ఎక్కడా పొంతన కుదరడం లేదని అన్నారు.

కోటి ఎకరాల సాగుకు 25 కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును మూడు లక్షల ముప్పై కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. నియామకాలు పూర్తి చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతందని శ్రవణ్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కలిచివేస్తుందన్నారు. ఐనా ప్రభుత్వం రైతులపై దయ చూపడం లేదన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ దోపిడి కొనసాగుతోందని విమర్శించారు. త్యాగాల పునాదుల మీద రాష్ట్రం వస్తే కేసీఆర్ కుటుంబం బోగాలు అనుభవిస్తోందన్నారు ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. విభజన హామీల అమలు వైఫల్యంలో ఏ1 బీజేపీ అయితే ఏ2 టిఆర్ ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు.

Telangana Journalistula Forum

ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఆత్మవంచనతో బతకాల్సి వస్తోందని మాలమహఆనాడు అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు హక్కులుగా మారాయని, వాటిని పార్లమెంట్ సాక్షిగా సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మార్పీయస్ జాతీయ అధ్యక్షుడు మందక్రిష మాదిగ అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఉన్న స్ఫూర్తిలో 10 శాతం ఉన్నా తెలంగాణ సుభిక్షంగా ఉండేదన్నారు మందక్రిష్ణ మాదిగ. ప్రధాని మోదీకి తెలంగాణ రావడమే ఇష్టం లేదన్నారు మందక్రిష్ణ మాదిగ. అవసరం దొరకినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ, విభజన హామీలను ఎలా తీరుస్తారో కేసీఆర్ కే తెలియాలని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హక్కులను సాధించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్న ఆయన.. హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రజలు మరో పోరాటం చేయాలని అన్నారు. నలభై రెండేళ్లుగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇప్పటికీ అతీగతీ లేకపోవడం దారుణమన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యునివర్శిటీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ప్రతి ఒక్కటి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఎంత ప్రమాదమో తెలంగాణకు కల్వకుంట్ల ఫ్యామిలీ అంతకంటే ప్రమాదకరమని కాంగ్రెస్ నేత, ఏఐసీసీఅధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ తరతరాలుగా పరిపాలించేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. టి జర్నలిస్టుల ఫోరం ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. నాటి ఉద్యమ హామీల కోసం మరో ఉద్యమానికి ఉద్యమకారులు, విద్యార్థులు ప్రణాళికలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. టి జర్నలిస్టు ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం భవిష్యత్తు కార్యాచరణకు వేదికగా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో విభజన హామీలను సాధించుకోవాలని మధుయాష్కి పిలుపునిచ్చారు.

Telangana Journalistula Forum
Telangana Journalistula Forum

ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమాదేవి, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల రవీందర్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జీ బుర్రరామ్, జై స్వరాజ్య పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు, లో క్ సత్తా పార్టీ ఇన్ ఛార్జీ నాగరాజు, జనసమితి పార్టీ నేత సంపత్ నాయక్, న్యూడెమోక్రసీ గోవర్దన్, సియాసత్ ఎడిటర్ జావెద్ అలీఖాన్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ర రెడ్డి, ప్రొ. విశ్వేశ్వరరావు, ఆర్టీసీ జేఏసీ నేత దొంత ఆనందం, యూటీఎఫ్ నేత జంగయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య, బెల్లయ్యనాయక్, విద్యార్థి సంఘాల నేతలు సాంబశివగౌడ్, ఆర్.ఎన్.శంకర్, అంజియాదవ్, వెంకటేష్ చౌహాన్, అఖిల్ కుమార్, పందుల సైదులు, దుర్గం భాస్కర్, వెన్నెల, దయాకర్, బీసీ సంఘం నేతలు కోలా జనార్దన్, సీనియర్ జర్నలిస్టు అయోధ్యరెడ్డి, ఎన్టీఎఫ్ నేత ఉషాకిరణ్, ట్రేడ్ యూనియన్ నేత కాసం సత్యనారాయణ, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు అంబటి నాగయ్య, ఎన్నికల నిఘా వేదిక కన్వినర్ వివిరావు, పలువురు ప్రజా సంఘాల నేతలు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టి ఫోరం అధ్యక్షుడు ప్రవేశ పెట్టిన పలు తీర్మానాలను రౌండ్ టేబుల్ సమావేశం ఏక గ్రీవంగా ఆమోదం తెలిపింది.

Telangana Journalistula Forum
Telangana Journalistula Forum
(Visited 178 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *