2 రోజులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాక్సిన్ డ్రై రన్

Spread the love

*రాష్ట్రవ్యాప్తంగా రేపు, ఎల్లుండి కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. టీకా ప్రారంభానికి ముందు ఏవైనా సమస్యలుంటే గుర్తించి పరిష్కరించడం, కొ-విన్‌ పోర్టల్‌ సామర్థ్యాన్ని తెలుకునేందుకే ఈ డ్రై రన్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రై రన్‌లో భాగంగా హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎంపిక చేసిన ఏడు చోట అధికారులు డ్రై రన్‌ నిర్వహించారు.*

*హైదరాబాద్‌లో గాంధీ దవాఖాన, తిలక్‌ నగర్‌ పీహెచ్‌సీ, నాంపల్లి ఏరియా దవాఖాన, సోమాజిగూడ యశోద దవాఖానతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర దవాఖాన, జానంపేట పీహెచ్‌సీ,* *మహబూబ్‌నగర్‌లోని నేహా సన్‌షైన్‌ దవాఖానల్లో డ్రై రన్‌ చేపట్టి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించారు.నామమాత్రపు (డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియనే డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్‌ డ్రిల్‌ లాంటిది. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్‌ ఇస్తారు.*

(Visited 109 times, 1 visits today)
Author: kekanews