మాహిష్మతి రేంజ్ గ్రాఫిక్స్..! కొత్త సెక్రటేరియట్ డిజైన్ అదుర్స్

Telangana New Secretariat Design Graphic Video
Spread the love

సీఎం కేసీఆర్ నిర్మించబోతున్న కొత్త సెక్రటేరియట్ డిజైన్ గ్రాఫిక్ వీడియోను ప్రభుత్వం రిలీజ్ చేసింది. నలు చదరంగా ఉంటూ.. లోపల గుండ్రంగా ఉండే ఆకృతిలో.. సెక్రటేరియట్ ను డిజైన్ చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైరింజన్లు తిరిగేలా.. విశాలమైన రోడ్లు డిజైన్ లో కనిపిస్తున్నాయి. పాత సెక్రటేరియట్ లో ఫైరింజన్లు తిరగటానికి కూడా రోడ్లు లేవన్న ఉద్దేశంతో.. కొత్త సెక్రటేరియట్ కడుతున్న సీఎం.. ఈసారి డిజైన్ ను బాగా చేయించినట్టుగా చెబుతున్నారు.

విశాలమైన సెక్రటేరియట్ డిజైన్ త్రీడీలో చూపించిన గ్రాఫిక్స్ లో అయితే బాగుందనిపిస్తోంది. ఐతే సీఎం చెప్పినట్టు 600కోట్ల రూపాయల బడ్జెట్ లో అయితే ఈ కట్టడం నిర్మాణం పూర్తికాదు. కనీసం ఓ రూ.2వేల కోట్లయినా ఖర్చవుతుందనిపిస్తోంది. ఆ మాహిష్మతి రేంజ్ గ్రాఫిక్ సెక్రటేరియట్ డిజైన్ వీడియో మీరూ చూడండి.

(Visited 352 times, 1 visits today)
Author: kekanews