అభినందన్ విడుదల వెనుక ఉన్న అసలు కథ

Abhinandan
Spread the love

స్వీడన్ కి చెందిన పత్రిక ఆసక్తికరమయిన విషయాన్ని ప్రచురించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల అనేది అంత సాఫీగా జరగలేదు. అభినందన్ విడుదల అవడానికి ముందు చాల పెద్ద కధే నడిచింది.

ఫీబ్రవరి 27 రాత్రి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ అంతా నిద్రలేని,భయంకరమయిన చీకటిలో గడిపారు. F-16 ని కోల్పోయిన తరువాత అమెరికా చాలా ఆగ్రహంతో ఉంది.కానీ పాకిస్తాన్ ని భారత దేశపు ప్రతి చర్యల నుండి కాపాడాలి ఎందుకంటే అభినందన్ పాకిస్థాన్ అధీనంలో ఉన్నాడు, అప్పటికే తన ఉపగ్రహ చాయా చిత్రాల ద్వారా, CIA అంతర్గత రిపోర్ట్ లో ఇచ్చిన వివరాలు ఖచ్చితంగా సరిపోలుతున్నాయి.

రిపోర్ట్ సారాంశం ఏమిటంటే అభినందన్ ని సురక్షితంగా ఎలాంటి హానీ జరగకుండా విడిపించుకోవడానికి భారత్ చాలా పెద్ద మొత్తంలో ‘బ్రహ్మోస్ ‘ మిస్సైల్స్ ని సరిద్దుల్లో మోహరించింది,అవి కాక అప్పటికే ‘బ్రహ్మోస్ ‘ మిస్సైల్స్ ని ప్రయోగించడానికి మార్పులు చేసిన 15 సుఖోయ్ SU-30 MKI లని సిద్ధం చేసి ఆర్డర్స్ ఇవ్వగానే గాల్లోకి లేచి ప్రయోగించడానికి…. ఈ ‘బ్రహ్మోస్ ‘ మిస్సైల్స్ ని సరిహద్దులకి దగ్గరగా ఉన్న ‘బ్రహ్మోస్ ‘ పరిధిలోకి వచ్చే అన్ని పాకిస్తాన్ ఎయిర్ బెసేస్ ని ధ్వంసం చేయడానికి రెడీ to ఆర్డర్స్ పరిస్థితిలో ఉన్నాయి.

ఇక సుఖోయ్ లు సరిహద్దులు దాటి ఎయిర్ లాంచ్ చేసి మిగతా ఎయిర్ బెసేస్ ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.అమెరికా అధికారులు పాకిస్తాన్ కి ఫోన్ చేసి ‘బ్రహ్మోస్ ‘ విషయం చెప్పి అభినందన్ కి ఎలాంటి హాని జరిగినా మొత్తం ఎయిర్ బెసేస్ కోల్పోవాల్సి వస్తుంది అని,తాము ఇచ్చిన F-16 లని రిమోట్ శాటిలైట్ ద్వారా పనిచేయకుండా చేస్తామని తీవ్రంగా హెచ్చరింది. అప్పటికే నిజాలు కక్కించాలని ఇంటరాగేషన్ కోసం అభినందన్ ని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించిన ISI అధికారులు.. విషయం తెలిసి ఖంగుతిన్నారు. వచ్చిన అవకాశం వదులుకోకూడదు అన్న కృత నిశ్చయంతో ఉన్న పాక్ సైన్య అధ్యక్షుడు బాజ్వా వెంటనే UAE కి వెళ్ళాడు,కానీ అప్పటికే UAE,సౌదీ ,రష్యా ,చైనా లకి అమెరికన్ అధికారులు విషయం తెలియచేసి మీరు ఏమాత్రం కలుగచేసుకున్నా పరిస్థితి అదుపు తప్పుతుంది అని హెచ్చరించింది. UAE అధికారులు భారత్ కి ఫోన్ చేసి ఒక్క రాత్రికి ఆగండి అని రిక్వెస్ట్ చేశారు. సహాయం కోసం వచ్చిన బాజ్వా కి తాము ఏమీ చేయలేమని పైలట్ ని విడుదల చేసి ప్రాణాలు దక్కించుకోమని తేల్చి చెప్పేశారు.

ఆశ చావని బాజ్వా అటునుండి అటే చైనా వెళ్ళాడు. చైనా శాటిలైట్ లింక్ తమకి ఇస్తే భారత భూభాగంలో ఏమి జరుగుతుందో తెలుసుకొంటాం అని అభ్యర్ధించాడు. దానికి చైనా ఒప్పుకోలేదు. కాగా మీరు మేము ఇచ్చిన లింక్ ని దుర్వినియోగం చేస్తారు అంటూ నేరుగా భారత అధికారులతో మాట్లాడి విషయం సెటిల్ చేసుకోండి అని ఉచిత సలహాతో పాటు చైనీస్ టీ ఇచ్చిపంపారు. బాజ్వా కంటే ముందే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా అధికారులతో మాట్లాడి ఈ విషయంలో మీరు తటస్టంగా ఉంటారనే ఆశిస్తున్నాము అంటూ ఓ సందేశం ఇచ్చారు.

అప్పటికీ ఆశ చావని బాజ్వా కొంతమంది ఉన్నత సైన్యాదికారులని టర్కీ పంపి శాటిలైట్ లింక్ ఇవ్వాల్సిందిగా కోరాడు, కానీ అప్పటికే టర్కీకి అమెరికా,రష్యా రాయబార కార్యాలయాల నుండి ఉమ్మడి సందేశం ఇచ్చాయి పాకిస్తాన్ విషయంలో కలుగచేసుకోవద్దు అంటూ. టర్కీ పాకిస్తాన్ కి చాలా అనుకూలమయిన దేశం కానీ అమెరికా ,రష్యాల మాట వినకుండా సహాయంచేస్తే కలిగే పరిణామాలు తెలుసు కాబట్టి సాటిలైట్ లింక్ ఇవ్వలేమని చెప్పింది.చేసేది ఏమీ లేక పాకిస్తాన్ ఆఘ మేఘాలమీద రెండు రోజుల తరువాత అభినందన్ ని గౌరవంగా వాఘా దగ్గర భారత్ కి అప్పచెప్పింది. ఇదంతా ఒకటిన్నర రోజు పట్టింది. ఈ తతంగం నడస్తున్న కాలంలో పాక్ సైన్యంలో ఉన్నతాధికారులు తమ నివాసంలోనే ఏర్పాటు చేసుకున్న అండర్ గ్రౌండ్ బంకర్స్ లోనే దాక్కున్నారు అన్న విషయం స్వీడిష్ పత్రిక పేర్కొంది. మనదేశపు మీడియా మాత్రం ఇంతవరకూ ఈ విషయాన్ని తెలిసీ మిన్నకుండి పోయాయి.

సేకరణ : ట్విట్టర్

(Visited 82 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *