బిగ్ బాస్ నుంచి జ్యోతక్క ఔట్.. ఇక ఫైనల్ ఫైట్

Shiva Jyothi Eliminated from bigg boss 3 telugu
0Shares

సోషల్ మీడియాలో లీకులతో కిక్కు దొబ్బింది కానీ.. ఈవారం బిగ్ బాస్ లో సంచలనమే నమోదైంది. అచ్చ తెలంగాణ ఆడపడుచు, టఫ్ కాంపిటీటర్ అనిపించుకున్న శివజ్యోతి బిగ్ బాస్ 14 వారంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక మిగిలింది పైనల్ వారమే. వారం రోజులే మిగిలి ఉండటం.. ఐదుగురు టఫ్ కంటెస్టెంట్స్ వరుణ్, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, ఆలీరెజా, శ్రీముఖి రేసులో ఉండటంతో.. ఆసక్తి మరింత పెరిగింది.

నవ్వులు.. ఏడుపులు… 

14 వారం వీకెండ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ సరదాగా, భావోద్వేగాలతో గడిచిపోయింది. విజయ్ దేవరకొండ, మీకు మాత్రమే చెప్తా టీమ్ సర్ ప్రైజ్ చేసింది. కన్ఫెషన్ రూమ్ లో విజయ్ ఉన్నాడని చెప్పిన నాగార్జున.. ఒక్కొక్కరికి హౌజ్ లోకి తోలాడు. ఒక్కొక్కరి దగ్గరా ఒక్కో వివరం రాబట్టి ఫన్ జెనరేట్ చేశారు విజయ్, నాగార్జున. ఆ తర్వాత స్టేజిపై బెలూన్ ను పగలకొట్టిన  విజయ్ దేవరకొండ.. అందులో వరుణ్ పేరు రావడంతో.. అతడు సేఫ్ అని ప్రకటించారు. ఆ తర్వాత.. ఎలిమినేషన్ లో శివజ్యోతి, ఆలీ రెజా ఇద్దరే మిగిలారు.

ఆ అక్షరం వెనుక…

విజయ్ , తరుణ్ భాస్కర్ టీమ్ ను పంపించిన తర్వాత.. ఎలిమినేషన్ కోసం ఓ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. బోర్డుపై బిగ్ బాస్ అక్షరాలను పేర్చారు. ఆ అక్షరాలను తిప్పి చూస్తే.. వెనుక ఎవరి ఫొటో ఉంటే  ఆ క్యాండిడేట్ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లాలన్న మాట. చివరినుంచి రెండో ఎస్ లెటర్ వెనుక శివజ్యోతి ఫొటో రావడంతో.. ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు.

శివజ్యోతి ఎలిమినేషన్ సోషల్ మీడియాలో లీక్ అయింది కాబట్టి.. ఉత్కంఠ అనిపించలేదు. కానీ… హౌజ్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. శివజ్యోతిని హత్తుకుని శ్రీముఖి బాగా ఏడ్చింది. ఆలీ కూడా. ఏడుస్తూ.. నవ్వుతూ… బాబా భాస్కర్ ఆశీస్సులు తీసుకుని బిగ్ బాస్ హౌజ్ ను వీడింది జ్యోతక్క.

శ్రీముఖికే పూలమాల

హౌజ్ లోకి వచ్చినప్పుడు మోసుకొచ్చిన ట్రంక్ పెట్టెను మళ్లీ శివజ్యోతికి ఇచ్చేశాడు నాగార్జున. ఐదుగురితో తనకు అన్నీ మంచి మెమరీస్ ఉన్నాయని చెప్పుకొచ్చింది శివజ్యోతి. నాగార్జున కోరడంతో.. ఓ పూలమాలను శ్రీముఖికి .. నాలుగు ముళ్లమాలలను మిగిలిన నలుగురు మేల్ కంటెస్టెంట్స్ కు అప్పగించింది శివజ్యోతి. హౌజ్ లో మిగిలిన ఒకే ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ శ్రీముఖి కాబట్టే పూలమాల వేసినట్టుగా చెప్పింది. ఏడుస్తూ.. హౌజ్ కు బై బై చెప్పేసింది శివజ్యోతి.

వరుణ్, రాహుల్, బాబా భాస్కర్, ఆలీ, శ్రీముఖి.. వీళ్లే బిగ్ బాస్ 3 ఫైనలిస్టులు. వీరిలో ఎవరు విజేత అనేది ఈ వారం ఎపిసోడ్ లో తేలిపోనుంది.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మంగ్లికి హీరోయిన్ చాన్స్.. త్వరలోనే తెరపై

Wed Oct 30 , 2019
మంగ్లి అలియాస్ సత్యవతి. వీ6 న్యూస్ ఛానెల్ లో పొలిటికల్ సెటైర్ ప్రోగ్రామ్ తో పాపులరైన మంగ్లి.. సింగర్ గానూ ప్రూవ్ చేసుకుంది. మైక్ టీవీ, మంగ్లీ టీవీ ఛానెళ్లలో.. బతుకమ్మ, సంక్రాంతి , తెలంగాణ పాటలతో తన ప్రజాదరణను అంతకంతకూ పెంచుకుంటోంది. సింగర్ గా ఆమె పాడిన పాటలు.. యూ ట్యూబ్ లో హాట్ కేకులు. సినిమాల్లోనూ ఆమె పాటలు పాడుతోంది. అల్లుఅర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..