చీరలో ఎగిరి తన్నించాడు.. అందుకే వర్మ అయ్యాడు!

Pooja Bhalekar RGV Enter The Girl Dragon
Spread the love

రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ బర్త్ యానివర్సరీ రోజు పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టపడే Ram Gopal Varma బ్రూస్ లీ లైఫ్ ఇన్ స్పిరేషన్ తో ఓ మూవీ తీయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. 2015లో గ్లామరస్ ఫైటర్ పూజా భలేకర్ తో చిన్న టీజర్ వదిలాడు. అది అప్పట్లోనే సెన్సేషన్. అప్పుడో సీన్…. అప్పుడో సీన్ కుదిరినప్పుడల్లా ఓ సీన్ తీసినట్టున్నాడు. ఇన్నేళ్లకు 2019 నవంబర్ 27 నాడు ‘రామ్ గోపాల్ వర్మ – ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ ఫుల్ లెంగ్త్ టీజర్ రిలీజ్ చేశాడు. లేడీ డ్రాగన్ వీరోచిత విన్యాసాలు, అందాలు చూసిన వాళ్లంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు.

చీరలోనూ తన్నే సీన్.. అదే వర్మ స్టైల్

పూజా భలేకర్ ఓ ముంబై మోడల్. ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ లో అదరగొట్టింది. తన ఫైట్స్ తో స్టన్నింగ్ యాక్షన్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అదేటైమ్ లో.. రామ్ గోపాల్ వర్మ కెమెరా కంటినుంచి ఆమె అందాలు కూడా అంతకంటే స్టన్నింగ్ అనిపించాయి. దాదాపు 4 నిమిషాల వీడియోలో… చీరలో ఉన్నప్పుడు కూడా ఆమె ఎగిరి తన్నే సీన్ కెవ్వు కేక. కట్టుబాట్లు ధైర్యానికి అడ్డుకావనీ… తెగువ చూపించి ప్రమాదం ఎదుర్కోవాల్సిందే అనే మెసేజ్ ఇచ్చాడు ఆ షాట్ తో.

Read Also : ఈ మంత్రులు, పోలీసులను చూస్తే అసహ్యం వేస్తోంది..!

హీరోయిన్, ఆమె లవర్, ఇద్దరి మధ్య ప్రేమ, మార్షల్ ఆర్ట్స్ లో ఆమె కెరీర్… ఇలా కీలక పాయింట్స్ ను టీజర్ టచ్ చేసింది. ప్రేమ, కెరీర్ మధ్య సంఘర్షణను ఆమె ఎలా ఎదుర్కొంది.. గోల్ ఎలా సాధించింది.. లైఫ్ ఎలా లీడ్ చేసిందనేది మూవీలో చూపించాడు వర్మ.

ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం కావడంతో… ఆసక్తి ఏర్పడింది. గ్లామరస్ ఫైట్స్ చూసేందుకు ఆడియన్స్ కూడా ఎదురుచూసేలా చేశాడు రామ్ గోపాల్ వర్మ.

 

(Visited 551 times, 1 visits today)
Author: kekanews