Krack – క్రాక్ : మూవీ రివ్యూ

Krack Movie Review
Spread the love

Krack Review

రవితేజ, శ్రుతిహాసన్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ క్రాక్.

సంక్రాంతి బరిలో ఇప్పటికే రవితేజ చాలా మూవీస్ వచ్చాయి.

కానీ… ఈ సినిమా వేరు.

కరోనా టైంలో .. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య రిలీజైంది క్రాక్ మూవీ.

రవితేజ… డైరెక్షన్.. గమ్మత్తైన స్టోరీ లైన్ కావడం.. టేకింగ్.. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణంగా.. ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సుల కారణంగా..  మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.

ముక్కు సూటిగా వెళ్లే… డ్యూటీనే ముఖ్యమనుకునే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రవితేజ. క్రాక్ సీఐ అని డిపార్టుమెంట్ లో పేరు.

యాభై రూపాయల నోటు.. మామిడి కాయ.. ఓ మేకు.

ఈ మూడు.. ముగ్గురు విలన్లకు సబంధించిన 3 వస్తువులు. ముగ్గురు విలన్లకు వీటికి ఏంటి సంబంధం..

రవితేజ వారిని ఎలా అరెస్ట్ చేస్తాడన్నదే ఇంట్రస్టింగ్ పాయింట్.

క్రాక్ మూవీ ఫస్టాఫ్ బాగుందనిపిస్తుంది. సెకండాఫ్ ఇలా చెడగొట్టాడేంటా అనిపిస్తుంది. కానీ… అందులోనూ.. మెస్మరైజింగ్.. ఆకట్టుకున్న యాక్షన్ సీక్వెన్సులు.. డైలాగులు… పాటలు ఆడియన్స్ ను సంతృప్తి చేస్తాయి.

అన్నీ కాదు కాదుగానీ.. మూవీని చూడాలనిపించే కొన్ని హైలైట్స్ చూద్దాం.

రవితేజ స్టైల్. యూనిఫామ్ లో దూసుకెళ్లే పాత్రలో రవితేజ చాలా బాగా చేశాడు. బాగా చూపించాడు దర్శకుడు.

సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకునేదే.

జయమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర.. సినిమా థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా గుర్తుండిపోతుంది.  సముద్రఖని.. మరోసారి ఆకట్టుకున్నాడు.

తమన్ అందించిన పాటలు.. ఆకట్టుకుంటాయి. ఐటమ్ సాంగ్ లో … అప్సర రాణి .. అందాలు గిలిగింతలు పెడతాయి.

గోపీచంద్ మలినేని దాదాపు 4 ఏళ్లు వెయిట్ చేసి అందించిన సినిమా ఇది. డాన్ శీను, బలుపు లాంటి కమర్షియల్ హిట్స్ అందించిన గోపీచంద్.. రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. హ్యాట్రిక్ విజయం అని చెప్పాలి.

పండగ చేస్కో, విన్నర్ లాంటి ఫ్లాపుల తర్వాత.. డైరెక్టర్ గాడిలో పడ్డాడనే చెప్పాలి.

 

 

(Visited 151 times, 1 visits today)
Author: kekanews