రవితేజ. టాలీవుడ్ లో మాస్ మహరాజ్. యూత్ హీరో కాకపోయినా… యూత్ ఫాలోయింగ్ పిచ్చపిచ్చగా ఉన్న క్రేజీ స్టార్.
రవితేజ కనిపిస్తే.. స్క్రీన్ పై ఓ ఉత్సాహం. ఓ ఉరుము. మరి అలాంటి రవితేజ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి తెల్సుకోవాలంటే అందరికీ ఇంట్రస్ట్ కచ్చితంగా ఉంటుంది.
లాక్ డౌన్ టైమ్ లో ఫిలింస్టార్స్ అంతా తమ ఫ్యామిలీతో గడిపేశారు. ఈ సమయంలోనే. చాలామంది సెలబ్రిటీలు.. అప్పటివరకు బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రవితేజకూడా.. తన కూతురు, కొడుకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు కొత్త సంగతులు చెప్పారు.
రవితేజ కూతురు, కొడుకు పేర్లు మోక్షద భూపతిరాజు, మహదాన్ భూపతి రాజు. ఇప్పటికే పలుమార్లు కొడుకుతో ఫొటోలను షేర్ చేసిన రవితేజ.. రీసెంట్ గా.. తన ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్నారు.
ప్రస్తుతం ఖిలాడీ, క్రాక్ సినిమాలు చేస్తున్న రవితేజ.. ఇటీవల చేసిన డిస్కోరాజా సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ హిట్టు కోసం చూస్తున్న రవితేజ.. త్వరలోనే కొత్త సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు.