ట్రెండింగ్ లో నం.1 ఆదిత్య అరుణాచలం… రజనీ ఈజ్ బ్యాక్

Darbar Official Trailer Rajinikath Murugadoss
Spread the love

Rajinikanth Darbar Trailer రిలీజ్ అయింది.  స్టైల్.. యాక్షన్.. ఎంటర్ టైన్ మెంట్.. ఈ మూడు కలిస్తే.. రజినీకాంత్. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చాన్నాళ్లకు కనిపించారు. మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన దర్బార్ మూవీ సంక్రాంతికి విడుదలవుతోంది. మేకింగ్ నుంచే ఆసక్తి రేపుతున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలై సంచలనం రేపుతోంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ట్రైలర్లు ట్రెండింగ్ లో టాప్ లో కొనసాగుతున్నాయి.

24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్, లైక్స్, కామెంట్స్ సంపాదించింది దర్బార్ మూవీ ట్రైలర్. రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి, మురుగదాస్ … ఇలా టాప్ కాంబినేషన్ కావడంతో… మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ అప్పీల్ ఉన్న బ్యాడ్ కాప్ గా రజినీకాంత్ ను చూపించాడు దర్శకుడు మురుగదాస్. సోషల్ ఇష్యూ చుట్టూ బలమైన కథ రాసుకుని సినిమాలు తీసి హిట్టు కొడుతుంటారు మురుగదాస్. తొలిసారి రజినీకాంత్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యారు.

రోబో సినిమా తర్వాత రజినీకాంత్ కు కమర్షియల్ హిట్ రాలేదు. వచ్చిన సినిమాల్లోనూ… రజినీకాంత్ ను ప్రేక్షకులు మెచ్చేలా చూపించలేకపోయారు దర్శకులు.  కానీ.. మురుగదాస్ ట్రైలర్ తోనే హిట్టు మార్కులు వేసుకున్నారు. తాను రజినీని ప్రేక్షకులు కోరుకున్నట్టు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ అందుకు నిదర్శనం. రజినీ స్టైల్ , మురగదాస్ టేకింగ్ తో.. మూవీకోసం ఎదురుచూసేలా చేశాడు.

హిందీలో మూవీ రిలీజ్ అవుతున్నప్పటికీ… బేస్ ఆడియన్స్ తమిళులను అలరించేలా.. అనిరుధ్ రవించంద్రన్ తమిళ మార్క్ మ్యూజిక్ ఇచ్చాడు . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటల్లో అది కనిపించింది. ఓవరాల్ గా ఆర్ఆర్ మంచి మార్కులే వేయించుకుంటోంది. సంక్రాంతి కానుకగా వస్తున్న దర్బార్ మూవీ బిజినెస్.. ట్రైలర్ తో మరింత ఊపందుకోనుంది. భారీ కలెక్షన్లు టార్గెట్ పెట్టుకున్నట్టు ఇండస్ట్రీ అంచనా వేస్తోంది.

ఇది కూడా చదవండి : CAA పొరుగు దేశాల ముస్లింలకు ఎందుకు పౌరసత్వం ఇవ్వదంటే..?

 

(Visited 100 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *